అత్తా కోడళ్ళు ఆషాడమాసంలో ఓకే ఇంటిలో ఉండకూడదా..? దీనికి నిజమైన కారణం ఏంటంటే..!

అత్తా కోడళ్ళు ఆషాడమాసంలో ఓకే ఇంటిలో ఉండకూడదా..? దీనికి నిజమైన కారణం ఏంటంటే..!

by Anudeep

Ads

 మన తెలుగు మాసాలలో  ఆషాడమాసంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనినే శూన్యమాసం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. శూన్యమాసం అంటే  శుభకార్యాలకు అనుకూలంకాని మాసం అని అర్థం. అయితే ఈ ఆషాడమాసంలో అత్తాకోడలు ఓకే గడపలో నివసించకూడదు అనే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇది ఎంతవరకు నిజం.. అసలు ఈ సంప్రదాయం గల కారణం ఏంటో తెలుసుకుందాం.

Video Advertisement

మన దేశంలో ఎక్కువ వరకు వివాహాలు మాఘ మరియు వైశాఖమాసంలో జరుగుతుంటాయి. ఇక వైశాఖ మాసము అంటే చెప్పనవసరమే లేదు ఇది మండే వేసవి అనుకూలమైనా మాసం. ఈ మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్ళికూతురు అసౌకర్యంగా భావన కలగడంతో అత్తాకోడళ్ల మధ్య సఖ్యత  లేకుండా పోతుంది అని  అంటారు. అందువల్లనే ఆషాడమాసంలో పుట్టినింటికి పంపిస్తారు అని చెబుతుంటారు పెద్దవారు. ఇది అసలు కారణం కానేకాదు.

 దీనికి రెండు విధాలైన కారణాలు ఉన్నాయి. ఆ విషయాలు ఎంటో మనం తెలుసుకుందాం రండి.

మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, ఆషాడ మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయడానికి అనుకూలంగా ఉండే మాసం. రైతు కష్టపడితే గాని దేశానికి ఆహారం అనేది దొరకదు. మరి ఈ మాసంలో కొత్తగా పెళ్లయిన వరుడు భార్య మీద వ్యామోహంతో ఎక్కడ వ్యవసాయ పనులను అశ్రద్ధ చేస్తాడో, వ్యవసాయం గురించి సరిగ్గా పట్టించుకోడు అనే భావనతో  కోడలిని పుట్టింటికి  పంపిస్తారని ఒక కారణంగా చెబుతారు.

మరొక అసలు కారణం ఏమిటంటే ఈ  ఆషాడమాసంలో భార్యాభర్తలు దగ్గర కావడం వలన కలిగే మొదటి సంతానము మంచి గుణగణాలు కలిగినవాడు కాలేడని పెద్దలు భావిస్తారు. మన దేశం సంప్రదాయానికి పెట్టింది పేరు కాబట్టి సంప్రదాయం ప్రకారం  భార్యాభర్తలకి పుట్టిన సంతానం మొదటి సంతానాన్ని  ధర్మ సంతానం అని, తర్వాత పుట్టిన సంతానం కామ సంతానంగా భావిస్తారు. ఈ ఆషాడమాసంలో కనుక కోడలు గర్భం దాలిస్తే వాళ్లకు పుట్టబోయే బిడ్డ మండే వేసవికాలంలో పుడుతుందని ఈ భావనతో భార్యాభర్తలను దూరంగా ఉంచడానికి పుట్టింటికి కోడలను పంపిస్తారు.

wife and husband 3

ఈ విషయం కొత్త జంటతో సంభాషించలేక ఆషాడమాసం నిబంధనలను అనుసరిస్తారు. అంతేగానీ అత్తా కోడలు ఒకే గడపలో ఉండకూడదు అనే కారణంచేత అయితే కాదు.


End of Article

You may also like