Ads
ఏ వ్యక్తి వేలిముద్రలు ఒక్కలా ఉండవన్న సంగతి తెలిసిందే. అలాగే.. నడక కూడా ఒకేవిధంగా ఉండదు. ఇక మనం ఐడెంటిటీ కోసం పెట్టుకునే సంతకాలు కూడా ఒకలా ఉండవన్న సంగతి తెలిసిందే. ఒకేలాంటి సంతకాలు ఉండకూడదు. మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకునే సంతకాలు పెడుతూ ఉంటాము.
Video Advertisement
అయితే.. మనం రకరకాలుగా సంతకాలు పెట్టేస్తూ ఉంటాం. కొందరు సింపుల్ గా పేరు రాసేస్తారు. మరి కొందరు ఒక్క లెటర్ ను మాత్రమే ఉపయోగిస్తారు. మరి కొందరు ఏమి రాసారో కూడా అర్ధం కాకుండా గీసేస్తారు. న్యూమరాలజిస్ట్ లు అయితే మనం పెట్టె సంతకాన్ని బట్టే అదృష్టం కూడా ఉంటుందని.. ఎలా పెట్టాలో తెలుసుకుని పెట్టాలని చెబుతుంటారు.
ఇది ఇలా ఉంటే, మనం పెట్టె సంతకాన్ని బట్టే మన వ్యక్తిత్వం కూడా ఉంటుందట. సంతకం పెట్టి కింద రెండు గీతలు గీసేవారు బాగా డబ్బు సంపాదిస్తారట. కానీ పిసినారులుగా వ్యవహరిస్తారట. వీరు అభద్రతాభావంతో ఉంటారట. కొందరు సంతకం పెట్టి కింద ఒక గీత గీసి రెండు చుక్కలు పెడతారట. వీరు డబ్బు సంపాదించడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారట. కానీ, వీరు బాగా డబ్బుని ఆదా చేస్తారట. కొందరు సింపుల్ గా సూటిగా సంతకం చేసేసారట. ఇలాంటి వారి సంపాదన సాధారణంగా ఉంటుందట. వీరు తమ ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరట.
కొందరు చిన్న చిన్న పదాలతోనే సంతకం చేసేసారట. ఇటువంటి వారికి డబ్బు ఎలా సంపాదించాలో, ఎలా తెలివిగా వ్యవహరించాలో బాగా తెలుసు. కానీ, వీరు దానికోసం ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇక సంతకంగా పేరుని రాసేసి కింద ఓ చుక్కను పెట్టేవారు ఆర్ధికంగా బలంగా ఉంటారట. వీరి మారీడ్ లైఫ్ కూడా సంతోషంగా ఉంటుందట. కొందరు పై నుంచి కిందకి సంతకం చేస్తుంటారు. ఇటువంటి వారు ప్రతికూల ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు అప్పులు చేయాల్సి వస్తుంది. ఇక అనేక వ్యాధులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక సంతకం చేసేటప్పుడు కొందరు సున్నితంగా చేస్తుంటారు. పెన్నుపై ఎక్కువ ఒత్తిడి పెట్టరు. అటువంటి వారు డబ్బు సంపాదన కోసం తమని తాము మార్చుకుంటారు. చాలా ఒత్తిడికి గురి అవుతారు. కొందరు సంతకం పెట్టేటప్పుడు మొదటి అక్షరాన్ని పెద్దదిగా రాసి, మిగతా అక్షరాలను చిన్నగా అందంగా రాస్తుంటారు. ఇటువంటి వారు క్రమంగా ఉన్నతస్థితికి చేరుకుంటారట.
సంతకంతో మొదటి అక్షరం పెద్దదిగా రాసేవారు మంచి మనసుని కలిగి ఉంటారు. వారికి అకస్మాత్తుగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంటుందట.
గమనిక: ఈ వివరాలన్నీ నిపుణుల అభిప్రాయాల మేరకు సేకరించిన సమాచారం. ఇవి కేవలం నమ్మకాలు మాత్రమే. వీటిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
End of Article