Ads
మనం ప్రతినిత్యం దేవుడిని పూజించే సమయంలో కర్పూరాన్ని వినియోగిస్తూ ఉంటాము. నైవేద్యం సమర్పించిన తరువాత.. దేవుడికి హారతి ఇవ్వడం అనేది పరిపాటిగా వస్తోంది. అయితే.. దేవుడికి ఇచ్చే హారతి కర్పూరం, వంటలలో వాడే పచ్చ కర్పూరం రెండు వేరు వేరు. దేవుడికి ఇచ్చే హారతి కర్పూరాన్ని పొరపాటున తిన్నా ఇబ్బందులు తప్పవు.
Video Advertisement
అయితే.. ఈ కర్పూరాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా కర్పూరాన్ని భారత దేశంలోనే వినియోగిస్తారు. మైనంలా తెల్లగా ఉండే కర్పూరం ఘాటైన సుగంధాన్ని కలిగి ఉంటుంది.
చాలా మందికి కర్పూరం గురించి తెలుసు. కానీ, కర్పూరం ఎలా తయారు అయ్యింది అన్న విషయం మాత్రం తెలియదు. కర్పూరం చెట్ల కాండం నుంచి తయారు చేయబడుతుంది. కర్పూరం చెట్టు నలభై మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అలాగే.. వెయ్యేళ్ళ వరకు బతికే ఉంటుంది. ఇది టర్పెనాయిడ్ అనే రసాయనాన్ని కూడా విడుదల చేస్తుంది.
ఈ రసాయనం సిన్నమోనం కామ్ఫర, రోజ్ మేరీ, కేంఫర్ బేసిల్, డ్రయనోబాలనోప్సిస్ వంటి మొక్కల నుంచి కూడా లభిస్తుంది. ఈ మొక్కల కాండాన్ని వేరు చేసి, చిన్న చిన్న ముక్కలుగా కొట్టేస్తారు. వీటిని ఒక పెద్ద బట్టీలో వేసి నీరు పోసి వేడి చేస్తారు. స్వేదన ద్వారా ఆవిరిని చల్లబరిచి కర్పూరాన్ని తయారు చేస్తారు. జపాన్ దేశంలో 150 ఏళ్ళ క్రితం నుంచి ఫుకుయోక అనే ప్రాంతంలో కర్పూరాన్ని తయారు చేస్తున్నారు. ఇదేవిధంగా చెట్ల ఆకులు, పండ్ల నుంచి కూడా కర్పూరం తయారు అవుతుంది.
End of Article