చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులను అస్సలు నమ్మకండి.. ఎందుకంటే వీరు ఎప్పటికైనా మిమ్మల్ని ముంచేస్తారు!

చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులను అస్సలు నమ్మకండి.. ఎందుకంటే వీరు ఎప్పటికైనా మిమ్మల్ని ముంచేస్తారు!

by Anudeep

Ads

చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు. చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది.

Video Advertisement

చాణక్యుడు సామాన్యుల జీవితం గురించి కూడా ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. వాటిని కనుక అనుసరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. చాణుక్యుడు చెప్పిన ముఖ్యమైన విషయాలలో కొన్నిటిని మనం ఇప్పుడు చెప్పుకుందాం.

జీవితంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అంత సులభమేమీ కాదు. అయితే.. మనకు ఎదురవుతున్న అనుభవాల ద్వారానే మనం జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉంటాము. అయితే.. కొందరు వ్యక్తులను పొరపాటున కూడా నమ్మవద్దని చాణుక్యుడు చాణక్య నీతిలో హితవు చెప్పాడు. ఎటువంటి వ్యక్తులను నమ్మవద్దని చెప్పాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆయుధాలు కలిగిన వ్యక్తి: చేతిలో ఆయుధాలను కలిగిన వ్యక్తి ఏ నిమిషం అయినా మనపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి వారు పైకి సన్నిహితంగా కనిపిస్తున్నప్పటికీ వారిని నమ్మకండి.

ప్రశాంతంగా ఉన్న నది: ప్రజలు నిశ్చలంగా సాగుతున్న నదిని కూడా ఎప్పటికీ నమ్మి ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా నది లోపల లోతు ఎక్కువగా, ప్రమాదకారిణిగా ఉంటుంది. మరోవైపు నది చివరలో ప్రవాహం అంత వేగంగా లేకపోయినప్పటికీ.. మధ్యలోకి వెళ్లేకొద్దీ ప్రవాహ వేగం పెరుగుతూ ఉంటుంది.

bulls 2

కొమ్ములు తిరిగిన జంతువులు: కొమ్ములు, గోర్లు వంటివి కలిగి ఉన్న జంతువులను కూడా ఎప్పుడూ నమ్మకూడదు. వాటితో మీరు మచ్చిక చేసుకున్నప్పటికీ అవి ఏ క్షణంలో అయినా దాడి చేయగలవు. అందుకే అటువంటి వాటికి దూరంగానే ఉండాలి. ఇటువంటి జంతువులను పెంపుడు జంతువులుగా పెంచడం కూడా మానుకోవాలి.


End of Article

You may also like