Ads
షాపింగ్ చేసి కొత్త డ్రెస్సులు ధరించడాన్ని చాలా మందికి ఇష్టపడుతుంటారు. కొంతమందైతే తరచుగా షాపింగ్స్ చేస్తుంటారు. కొత్త డ్రెస్సులను ధరించడం ద్వారా అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. అయితే, ఇది షోకులకు మాత్రమే వర్తిస్తుంది. దీని వెనుక పెద్ద ఆరోగ్య సమస్య దాగి ఉంది.
Video Advertisement
కొత్త బట్టల్లో అనేక వ్యాధులకు కారణమయ్యే క్రిములు, బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కొత్త డ్రెస్సుల వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంటుందట. అయితే, కొత్త బట్టలు తీసుకున్న తరువాత ఉతకకుండా ధరించడం వల్ల కలిగే అనర్థాలేంటో చూద్దాం..
#1. చాలా మంద్రి ట్రయల్ వేసి ఉండొచ్చు:
ఎవరైనా కొత్త దుస్తులు కొనడానికి వెళితే.. ఒకసారి వాటిని ట్రయల్ వేస్తారు. నచ్చితే కొత్తవాటిని కుంటారు. దీని ప్రకారం.. ఎంతో మంది ఆ డ్రెస్సులను ట్రయల్ వేసే అవకాశం ఉంది. కొందరికి చెమట ఎక్కువగా పడుతుంది. ట్రయల్స్ సమయంలో ఆ చెమట దుస్తులకు పడుతుంది. దీంతో బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఇదే డ్రెస్సులను ఇతరులు వేసుకుంటే.. ఆ బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపిస్తుంది.
#2. ఇన్ఫెక్షన్లకు కారణం:
కొత్త బట్టలు అనేక ఇతర రకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ఎందుకంటే.. కొత్త డ్రెస్సులు ఫ్యాక్టరీ నుంచి తయారై నేరుగా అవుట్‌లెట్‌కు చేరుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో, డ్రెస్సులు అనేక చేతులు మారుతుంది. వారిలో ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో చెప్పలేం. అందుకే కొన్న దుస్తులను ఉతికిన తరువాతే వేసుకోవడం మంచిది.
#3. రంగులు వేసిన డ్రెస్సులు:
అనేక డ్రెస్సులకు అద్దకం చేస్తారు. ఇలాంటి డ్రెస్సులను ఖచ్చితంగా వాష్ చేయాలి. ఈ డ్రెస్సులను ఉతకకుండా వేసుకుంటే.. ఆ కెమికల్ రంగులు శరీరానికి అంటుకుంటాయి. ఆ కారణంగా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఈ డ్రెస్సులను ఉప్పునీటిలో ఉతికి, ధరించాలి.
రసాయనాల ఉపయోగం:
కొత్త బట్టలు నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అయితే, బట్టలను ప్యాక్ చేసే సమయంలో పురుగులు రాకుండా కొన్ని రసాయనాలు వాడతారు. ఆ రసాయనాల వల్ల అలర్జీ రావొచ్చు. కాబట్టి కొత్త బట్టలు వేసుకునే ముందు వాష్ చేయడం మరిచిపోకండి.
End of Article