అమ్మాయి, అబ్బాయి సమానంగా పెరగాలి అంటే.. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే..!?

అమ్మాయి, అబ్బాయి సమానంగా పెరగాలి అంటే.. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే..!?

by Anudeep

Ads

అబ్బాయి పుట్టగానే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరపడిపోయే కుటుంబాలు, అదే అమ్మాయి పుట్టిందనే సరికి ఢీలా పడిపోతారు. ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందనే ధోరణి చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది.

Video Advertisement

ఆస్తి పంపకాల విషయంలోనూ, నచ్చిన చదువును చదివించడానికి మగపిల్లాడికి ఉన్న ప్రాధాన్యత ఆడపిల్లకి ఉండదు. ఈ పద్దతి మారాలంటే ఏం చేయాలో చూద్దాం..

#1. ప్రతి పనిలోనూ భాగం చెయ్యాలి:


పనులతోనే స్త్రీ, పురుషులను వేరు చేయడం మొదలవుతుంది కాబట్టి మొదట దాన్ని దూరం చెయ్యాలి. ఇంటిపని, వంటపని, బయట పనుల్లోనూ ఇద్దరు పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి. ఇద్దరినీ ప్రతి పనిలోనూ భాగస్వామ్యం చేసే బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది.

#2. కథలు చెప్పండి:


మంచి కథలను పిల్లలకు ఆసక్తి కలిగేలా చెప్పాలి. అందులో ఎంచుకునే కథాంశం కూడా లింగవివక్షత, ధీరవనితల గురించి మగపిల్లలుకు కథలు అల్లి చెప్పడం వల్ల అవి భవిష్యత్ లో వారికి ఆడవారిపట్ల గౌరవంతో మెలిగేలా చేస్తాయి.

# 3. చిన్నపాటి చర్చలు చేయండి:


పిల్లలతో చిన్న చర్చలు చేయాలి. చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలి. ఇది వారికి ప్రతి విషయాన్ని గమనించే శక్తిని ఇస్తుంది.

#4. పంచుకోవడం నేర్పాలి:


ఏ వస్తువు కొన్నా ఆడపిల్లకు పంచాకే మగవారికి ఇచ్చే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మగపిల్లాడికి ఆడపిల్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఇంట్లో చూపుతున్నారని అర్థం అవుతుంది. ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటినీ ఆడపిల్లలు, మగపిల్లలు సమానంగా పంచుకునే అలవాటు అలవడుతుంది.

#5. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి:


ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ తక్కువ అనే విషయాన్ని వదిలెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినా కాకపోయినా ఎవరిపని వాళ్ళు బాధ్యతగా చేస్తుంటారు కాబట్టి ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటే పిల్లలకు అదే అలవాటు అవుతుంది.

#6. తప్పుని ఒప్పుకోవాలి:

తప్పు చేసినా, తప్పుగా ప్రవర్తించినా, ఏదైనా సమస్యలో చిక్కుకున్నా దాన్ని బయటకు చెప్పి ఒప్పుకునే మనస్తత్వాన్ని పెంచాలి. దీనివల్ల భవిష్యత్తులో అన్నిటినీ అంగీకరించే మానసిక సామర్థ్యము పెరుగుతుంది. పైన చెప్పుకున్నట్టు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ పద్దతిని పాటిస్తే సమాజంలో లింగ వివక్షత అనే పెద్ద విషయాన్ని పరిష్కరించి లింగసమానత్వాన్ని సాధించవచ్చు.


End of Article

You may also like