Ads
మన చుట్టూ ఉండే సమాజంలో పెళ్ళవగానే అమ్మాయే.. అత్తవారింటి వెళ్లడం చూస్తున్నాం కానీ అబ్బాయి అత్తగారింటి ఇల్లారికం వెళ్లడం అనేవి చాలా అరుదుగా చూస్తుంటాం. పెళ్లి అయిన తర్వాత భార్యే.. భర్త ఇంటికి ఎందుకు వెళ్ళాలి? భర్త భార్య ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు అనే సందేహం మీకు వచ్చిందా..
Video Advertisement
అసలు ఈ పద్ధతి ఎలా ప్రారంభం అయిందో తెలుసా..? భార్య.. భర్త ఇంటికి వెళ్ళడమనేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉందని మనం అనుకుంటాము. కానీ ఇది ఒకప్పుడు ఇతర దేశాల్లో కూడా ఉండేది. కొంతకాలానికి నాగరీకత అభివృద్ధి చెందే కొద్దీ వారు ఈ పద్ధతిని అనుసరించడం మానేసారు.
డబ్బు కోసమనే కాకుండా సాధికారత కోసం, తనకు నచ్చిన పని చెయ్యటం కోసమనో, హోదా కోసమో ఒక స్త్రీ ప్రస్తుతం ఎన్నో రకాల పనులు చేస్తున్న ఈ కాలంలో భార్య భర్త వెనకాలే వెళ్లడం అనేది నిస్సందేహంగా వ్యతిరేకించదగినదే. కానీ మనం వెనక్కు వెళ్తే.. రాజులు కాలం దాటి అప్పుడప్పుడే మనిషి కాపురాలు ఏర్పరుచుకొన్న కాలానికి అంటే.. ఆదిమానవుని కాలానికి వెళ్తే..
కేవలం వేటకు వెళ్ళి జంతువును వేటాడి ఆహారం సంపాదించుకోవడమనే ఉద్యోగం తప్ప చేయడానికి వేరే ఉద్యోగం లేని కాలం అది. ఆ ఆహారం సంపాదించే పని భర్తది. కాబట్టి పూర్తి శారీరక శ్రమ, ఎంతో ప్రమాదానికి చోటున్న పనిలో తన భార్యను దింపకూడదని ఆనాటి ఆ అనాగరిక మనిషి (ఆది మానవుడు) అనుకొని ఉంటాడు.
ఎక్కడ ఎక్కువ నీరు దొరుకుతుందోనని వెతుక్కుంటూ, ఎక్కడ ఆహారం పుష్కలంగా దొరుకుతుందో అక్కడకు తన నివాసాన్ని, తనతో పాటూ తన కుటుంబాన్నీ మార్చుతూ ఉండి ఉండొచ్చు. అలా ఒక స్త్రీ అప్పట్లో తన భర్త వెనకాలే వెళ్ళి ఉండొచ్చు. ఇలా ఒకనాటికి సందర్భోచితంగా ఉన్న ఆచరణలు కాలానుసారంగా ఆచారాలుగా, సాంప్రదాయాలుగా మారి ఇప్పుడు కొందరికి గుదిబండలుగా తయారయ్యాయి.
చివరకు కొందరు ఆడవాళ్లు పెళ్ళవగానే ఉద్యోగాలు మానేసేలా. అయితే పూర్తిగా భార్య వెనుక భర్త వెళ్ళిపోవడం లేదా పూర్తిగా భర్త వెనకే భార్య వెళ్లడం కాకుండా.. వారి ఉద్యోగ, ఇతర పరిస్థితులను బట్టి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఒకరి వెనుక ఒకరు హచ్ కుక్క పిల్లలా వెళ్లినట్టు కాకుండా కలిసి జీవించడానికి అడుగులు వేస్తున్నట్టు ఉంటుంది. అప్పుడే వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది.
End of Article