ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే.. భోజనం చేసాక ఈ ఒక్క ట్రిక్ పాటించి చూడండి!

ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే.. భోజనం చేసాక ఈ ఒక్క ట్రిక్ పాటించి చూడండి!

by Anudeep

Ads

మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా.. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు బరువు తగ్గటం లేదా.. ఏంటి కారణం అని ఆలోచిస్తున్నారా.. కొంత మంది అధిక బరువుతో బాధపడుతూ తమ ఆహార నియమాలను మార్చుకుంటారు. ఎన్నెన్నో వ్యాయామాలు చేస్తారు. కాని కొంచెం కూడా తమ అధిక బరువును తగ్గించుకోలేరు.

Video Advertisement

ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గలేరు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా…? ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఫలించలేదా ..?

కొందరిలో మాత్రం వారు ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉంటారు. మీరు కూడా అలా ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే.. ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది. మీరు ఇప్పటికే లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా.. మీ వయసు ఎక్కువ అయినా.. చిన్న వయసు వారు అయినా మీరు ఆరోగ్యవంతంగా, ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటే ఈ ట్రిక్ ను పాటించవచ్చు. ఇక బిపి, షుగర్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ కారణంగా ఉన్నట్లుండి బరువు పెరిగిపోతున్న వాళ్లకి ఈ ట్రిక్ బాగా పనికొస్తుంది.

చాలా మంది వ్యాయామం చేస్తున్నాం.. ఆహరం తీసుకోవడం తగ్గించాం కదా.. అయినా బరువు తగ్గడం లేదేంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ, కేవలం వీటి వలన బరువు తగ్గడం అనేది సాధ్యం కాదు. ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్న డైజెస్టివ్ సిస్టంలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే భోజనం చేసిన తరువాత ఒక చిన్న బెల్లం ముక్కను నోటిలో పెట్టుకోండి. ఫలితంగా ఇది మీ జీర్ణవ్యవస్థని మెరుగు పరుస్తుంది. భోజనము చేసాక స్వీట్ తినాలి అన్న కోరిక తగ్గుతుంది. భోజనం చేసాక గ్యాస్ రాకుండా ఈ బెల్లం నివారిస్తుంది.

అలాగే రక్తంలో ఉండే మలినాలను శుభ్రం చేయడంలో కూడా బెల్లం ముక్క కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా బెల్లం ముక్కని తీసుకుంటూ క్రమం తప్పకుండ వాకింగ్ చేయడం వలన తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోతారు. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బెల్లం ముక్కని పరగడుపున తీసుకోరాదు. అలాగే.. ఎక్కువ మొత్తములో కూడా తీసుకోకూడదు.


End of Article

You may also like