Ads
శ్రావణ మాసం అనగానే ముందు గుర్తొచ్చే స్త్రీలు పాటించే నోములు, పూజలే. మహాలక్ష్మి దేవి కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం లో వారు తమ సౌభాగ్యం కోసం నోములు, వ్రతాలూ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ మాసం శివుడికి, నారాయణుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసమట. చాంద్రమానం ప్రకారం వచ్చే ఐదవ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుచుకుంటాం.
Video Advertisement
అయితే.. శ్రావణ మాసం రాగానే అతివలందరు అమ్మవారి పూజల్లో మునిగిపోతుంటారు. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజు చాలా విశేషమైనది. ఆరోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే.. కొందరు మహిళలకు ఈ వ్రత విషయమై సందేహాలు ఉన్నాయి. ఈ వ్రతాన్ని అందరు ఆచరించుకోవచ్చా? లేక ఆనవాయితీ ఉన్న వారికి మాత్రమేనా? అన్న సందేహాలు చాలా మందికి కలుగుతూ ఉంటాయి.
నిజానికి.. ఆనవాయితీ అన్న పదానికి అర్ధం గురించి ఆలోచిస్తే.. అది కుటుంబంలోని పూర్వీకుల నుంచి వచ్చేదని అర్ధం. కుటుంబంలోని పూర్వీకులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి ఉంటె వారికి ఆనవాయితీ ఉందని భావిస్తుంటారు. కానీ.. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అమ్మవారి అనుగ్రహం కోరుకునే ప్రతి మహిళా ఈ వ్రతాన్ని నిస్సంకోచంగా చేసుకోవచ్చు. వరాలు ఇచ్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తారు. అమ్మ అనుగ్రహం కోసమే కదా ఎవరు పూజ చేసుకున్నా.. అందుకే, ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి ఆనవాయితీ అనేది అవసరం లేదు.
అయితే.. ఆనవాయితీ లేకుండా పూజని ఆచరించుకుంటే అనర్ధాలు జరుగుతాయి అని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. కానీ.. పూజ చేసుకుంటే అమ్మ వారి అనుగ్రహిస్తారు తప్ప మరేమీ కాదు. కానీ.. శ్రావణ మాసంలో మంగళవారం నోములు చేసుకునే వారు ఉంటారు. మహిళలు ఎక్కువ గా ఆచరించే వ్రతాలలో మంగళ గౌరీ వ్రతం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కొత్త గా పెళ్లి అయిన ముత్తైదువులు ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. నెలలో అన్ని మంగళవారాలు ఈ నోమును చేయడం తో పాటు.. శ్రావణ మాసం లో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
మంగళవారం నోములు నోచుకోవడానికి చాలా నియమాలు ఉంటాయి. ఈ నోములు నోచుకోవడానికి కుటుంబ నియమాలను పాటించినా.. వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మాత్రం ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఎటువంటి వారు అయినా.. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చని.. ఈ వ్రత కథలోనే చెప్పబడింది. కాబట్టి ఈ వ్రత విషయంలో మాత్రం ఎటువంటి అనుమానాలు అవసరం లేదు.
Watch Video:
End of Article