మీకు కలలో ఆరిపోయిన దీపం కనిపించిందా..? అయితే మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకొండి..!

మీకు కలలో ఆరిపోయిన దీపం కనిపించిందా..? అయితే మీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకొండి..!

by Anudeep

Ads

హాయిగా నిద్రపోతున్నప్పుడు అందరికీ మధ్య మధ్యలో కొన్ని కలలు రావడం చాలా సహజం. అవి ఊరికే వచ్చాయి అనుకోని పొరపాటు పడకండి.. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది.

Video Advertisement

మనకు వచ్చే కలలలో మంచి, చెడు అని రెండు రకాలు ఉంటాయి. కొన్నిసార్లు కలలు మనకు రాబోయే భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా సూచిస్తాయి. కలలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని కలలు చాలా మంచిగా, ఆహ్లాదంగా ఉంటాయి.

మరికొన్ని చెడ్డగా మనసును భయపెట్టేదిగా ఉంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు తరచుగా మనం నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాము.కొన్నిసార్లు మనకు కలలో దీపాలు , మంట కనిపిస్తూ ఉంటాయి. ఇది కనిపించే విధానాన్ని బట్టి ఆ కళకు అర్థం మారుతుంది అని స్వప్న శాస్త్రం చెబుతుంది. కలలో మండుతున్న లేదా ఆరిపోయిన దీపం కనిపిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయట. మరి అదేమిటో ఈరోజు జ్యోతిష్యుడు, పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ద్వారా తెలుసుకుందామా…

స్వప్న గ్రంధం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో వెలుగుతున్న లేక మండుతున్న దీపాన్ని చూస్తే అది శుభ సంకేతం. మండుతున్న దీపం స్వప్నం లో కనిపించడం అంటే అది మనకు భవిష్యత్తులో కలగబోయే గౌరవం, ప్రతిష్ట కు నిదర్శనం. కలలో వెలుగుతున్న దీపం కనిపించడం రాజయోగానికి సంకేతం. ఎలా అయితే దీపపు వెలుగు చీకటిని పారద్రోలి కాంతిని పంచుతుందో అదే విధంగా మీ జీవితం నుంచి అపజయం దూరమై విజయం చేరువవుతోంది అని సూచన ఇస్తుంది ఈ కల.అలాగే ఒక వ్యక్తి తన కలలో మండుతున్న అఖండ జ్యోతిని చూసినట్లయితే ఆ వ్యక్తికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగి దీర్ఘాయువుతో ఉంటాడని పెద్దలు చెబుతారు.

మరి కలలో ఆరిపోయిన దీపం కనిపించినట్లయితే ఏం జరుగుతుంది…. దీపం ఆరడం అంటే అశుభ సూచన. ఇలా కలలో ఆరిన దీపం కనిపించినట్లయితే మన సంకల్పశక్తి బలహీన పడుతుంది అని అర్థం. మనం ఏ పనిలో కష్టపడి పని చేసిన కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు అని ఈ కల సూచిస్తుంది.అంతే కాదు కలలో కనిపించే ఆరిపోయిన దీపం జీవితంలో ఎదురు కాబోయే వైఫల్యాలను , ఆరోగ్య సమస్యలను, కుటుంబ కలతలను సూచిస్తుంది. అందుకే ఇలాంటి పీడ కలలు వచ్చినప్పుడు ఇష్ట దైవ నామస్మరణ వాటి ఫలితాలను చాలా వరకు తగ్గిస్తుంది అని పెద్దలు చెప్తారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. Telugu adda దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )


End of Article

You may also like