ఏదైనా అనకూడనిది అనినప్పుడు…”రామ రామ” అని ఎందుకు అంటారో తెలుసా.?

ఏదైనా అనకూడనిది అనినప్పుడు…”రామ రామ” అని ఎందుకు అంటారో తెలుసా.?

by Anudeep

Ads

ఏదైనా తప్పు జరిగినప్పుడు, చూడకూడనిది చూసినప్పుడు శివ శివా, రామరామా, అనుకోవడం పరిపాటి. అసలు ఇలా అనుకోవడం లో ఆంతర్యం ఏంటి. ఎప్పటి నుంచి ఇలా అనుకోవడం అలవాటైంది.,?? ఇప్పుడు తెలుసుకుందాం.
శివమహాపురాణం రుద్రసంహిత ఇరవైనాలుగో అధ్యాయంలో ..ఈ కథాసందర్భం కనిపిస్తుంది.

Video Advertisement

రామాయణంలో శ్రీ రామ చంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో సీతాపహరణ జరిగింది.రావణ వధ కోసం సీతాపహరణ జరిగింది. అప్పుడు రాముడు, లక్ష్మణుడు సీతామాత కోసం అడవుల్లో అడుగడుగునా వెతుకుతూ ముందుకు వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి: మనిషి చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను కలిపి కడతారు ఎందుకు? కారణం ఇదే.!

 

WHY TO SAY SIVA SIVA WHILE LISTENING BAD WORDS
ఆ సమయంలో ఏక పత్ని వ్రతుడైన శ్రీ రామ చంద్రుడు అమిత దుఃఖంలో ఉన్నారు. అప్పుడు లోక సంచారం చేస్తూ ఆకాశ మార్గాన వెళ్తున్న పార్వతి పరమేశ్వరులు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూసారు. భార్య కోసం రాముడు విలపిస్తున్న తీరు సతీదేవికి ఆశ్చర్యాన్ని కలిగించింది. భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా? పురుషులు స్త్రీల విషయంలో ఇంత మమకారాన్ని కలిగి ఉంటారా..? అందులోనూ భార్యను ఇంతగా ప్రేమిస్తారా అనే సందేహాలు సతీ దేవికి కలిగాయి. అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది.

WHY TO SAY SIVA SIVA WHILE LISTENING BAD WORDS

అప్పుడు శివుడు పార్వతి తో శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని, ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు బాగా తెలుసు. ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ, ఆరాధించటంలోనూ రాముడిని మించినవారు ఎవరూ లేరని ఆయన వివరించారు. కానీ సతీదేవి ఆ విషయం అంతగా నమ్మలేదు.రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో ఉండటం, ఆయన అడుగులు ముందుకేయటం ఇవన్నీ నటన అని భ్రమించింది పార్వతి.

ఇవి కూడా చదవండి:అన్నిరోజులు బంధించినా…రావణుడు సీతను ముట్టుకోలేదు..! ఎందుకో తెలుసా.? కారణం “రంభ”

 

అందుకే మళ్లీ ఆ పరమేశ్వరి శివుడిని రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తమకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే.. తాను స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గుతేల్చాలనుకొంటున్నట్లు చెప్పింది. శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్నీవ్రతం విషయంలో రాముడిదే గెలుపవుతుందని అన్నాడు. సతీదేవిని వెళ్లి రాముడిని పరీక్షించమని చెప్పి ఆయనొక మర్రిచెట్టు కిందకు వెళ్లాడు. వెంటనే సతీ దేవి సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు ఎదురుగా నడుస్తూ రా సాగింది.

sri rama

శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని, తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకొంది.  కానీ సీతగా రూపం మార్చుకొన్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు శివ శివా అంటూ శివనామస్మరణం చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్లిపోయాడు. లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు. అప్ప్పుడు రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని సతీదేవి గ్రహించింది. భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో, భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది.

lord rama

అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివా అనటంవల్ల శివనామం పాపహరణమని, అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది. అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది. అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది. పురాణకాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివ శివా అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని ఈ పురాణ కథ వల్ల తెలుస్తోంది.


End of Article

You may also like