వాహనాలపై వేసే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసా..?

వాహనాలపై వేసే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసా..?

by Anudeep

Ads

వాహనాలపై సహజంగానే చాలా మంది రక రకాల స్టిక్కర్లను అతికిస్తుంటారు. కొందరు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు చెందిన పేర్లను రేడియం స్టిక్కర్ల రూపంలో అతికిస్తారు. కొందరు భిన్న రకాల డిజైన్లకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు. ఇక కొందరు దైవాలకు చెందిన స్టిక్కర్లను అతికిస్తారు.

Video Advertisement

ఇప్పుడు ఈ చిత్రం వెనుక ఉన్న కథ తెలుసుకుందాం. ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ను కరణ్‌ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్‌ వేశారు. ఈయన కేరళలోని కాసరగోడ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడ. ఒక సంవత్సరం క్రితం మంగళూరుకు వెళ్లాడు.

hanuman stickers on vehicles
హనుమాన్‌ అంటే ఉగ్రరూపంలో ఉంటే బాగుంటుంది కనుక.. ఆయన అలా కోపంగా చూస్తున్నట్లు కరణ్‌ బొమ్మ గీశారు. ఈ చిత్రానికి ఆయన ప్రధాని మోడీ నుంచి  ప్రశంసలు అందుకున్నారు.
గణేష్ చతుర్థి సందర్భంగా స్నేహితుల బృందం కోసం 2015లో దీనిని రూపొందించానని, అరగంట కంటే తక్కువ సమయం పట్టిందని కరణ్ చెప్పాడు. “నేను గ్రాఫిక్స్ పూర్తి చేసిన తర్వాత, నేను దానిని స్నేహితుడికి పంపాను. రెండు రోజుల తర్వాత, సోషల్ మీడియాలో నా స్నేహితులు కొందరు తమ ప్రొఫైల్ గా ఉపయోగించడం చూశాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు తెలియని వారు కూడా దీని ఉపయోగిస్తున్నారు అని తెల్సింది. అది చాలా పాపులర్ అయిందని నేను గ్రహించాను” అని కరణ్ చెప్పాడు.

hanuman stickers on vehicles
అయితే ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తామని, హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ కరణ్‌ ఆచార్య అందుకు నిరాకరించారు. ఈ హనుమాన్‌ బొమ్మను రాయల్టీ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని ఖరాఖండిగా చెప్పేశారు. ప్రజలందరూ ఈ బొమ్మను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు.

hanuman stickers on vehicles

అందుకనే చాలా మంది ఈ బొమ్మను వాహనాలపై స్టిక్కర్‌ రూపంలో వేసుకుంటున్నారు. ఇక హనుమాన్‌ అంటే మనకు ఎలాంటి ఆపదా రాకుండా చూసుకుంటాడు, ప్రమాదాల నుంచి రక్షిస్తాడు కనుక చాలా మంది వాహనాలపై ఆయనకు చెందిన ఈ స్టిక్కర్‌ను అతికిస్తుంటారు. ఇదీ ఆ స్టిక్కర్‌కు చెందిన అసలు విషయం..


End of Article

You may also like