Ads
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో ప్రతి ఊరు, ప్రతి వాడలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అచ్చ తెలంగాణ ఆడపడచు ప్రతి ఏడూ పుట్టింటికి వెళ్లి చేసుకునే పండగే బతుకమ్మ. దసరాకు తొమ్మిది రోజుల ముందే బతుకమ్మ వేడుకలు మొదలవుతాయి.
Video Advertisement
అత్తింటి నుంచి పుట్టింటికి చేరుకున్న ఆడపిల్లలు రకరకాల పూలను త్రికోణాకారం లో పేర్చి బతుకమ్మను ఆహ్వానిస్తారు. ఆ బతుకమ్మను ఆడపిల్లలంతా ఓ చోట పేర్చి.. దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ ఉంటారు. “బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాట పాడుతారు. ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి దసరా కి ముందు చేసే సద్దుల బతుకమ్మ వరకు ప్రతి ఇంట్లోనూ సంబరమే నెలకొని ఉంటుంది.
మగవాళ్లేమో తంగేడు, గూనుగ వంటి రకరకాల పూలను ఉత్సాహంతో సేకరిస్తారు. ఆడపిల్లలు తాము అందం గా అలంకరించుకుని.. ఈ పూలను కూడా బతుకమ్మకు అలంకరించి ముస్తాబు చేస్తారు. ఈ బతుకమ్మను మధ్యలో పెట్టి.. చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు.. ఆటలు ఆడుతారు. ఆ తరువాత ఈ బతుకమ్మను తీసుకెళ్లి నీటిలో వదిలివేస్తారు.
బతుకమ్మని నీటిలోనే ఎందుకు వదిలేస్తారో తెలుసా? రాబోయే కాలం వర్షాకాలం. ఈ కాలం లో వాగులు, నదులలో నీరు పొంగి ఉంటుంది. బతుకమ్మలో పెట్టె గానుగ, తంగేడు పూలకు నీటిని శుభ్రపరిచే గుణం ఉంటుంది. అందుకే బతుకమ్మను నీటిలో వదిలివేస్తే ఈ పూలు నీటిని శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడతాయని పెద్దలు అలాంటి ఆనవాయితీ ని పెట్టారు.
End of Article