కాలి మెట్టెలకి… గర్భం దాల్చడానికి సంబంధం ఉందా..? దీని వెనుక ఇంత అర్థం ఉందా..?

కాలి మెట్టెలకి… గర్భం దాల్చడానికి సంబంధం ఉందా..? దీని వెనుక ఇంత అర్థం ఉందా..?

by Anudeep

Ads

హిందూ సంప్రదాయంలో పెళ్లి అయిన మహిళలు తప్పనిసరిగా మట్టిగాజులు, ముక్కుపుడక, కాళ్లకు మెట్టెలు, తాళి ధరించాలి అనే నియమాలను మన పూర్వీకులు సంప్రదాయాలుగా పెట్టారు. హిందూ ధర్మంలో పెళ్ళైన స్త్రీలను లక్ష్మి దేవిగా భావిస్తారు. ఆయితే స్త్రీ ధరించే ప్రతిదానికి వెనుక పరమార్ధం ఉంది..

Video Advertisement

మన దగ్గర చాలా మంది వివాహ సమయంలో కచ్చితంగా పాటించే ఆచారంలో ఒకటి మెట్టెలు తొడగడం. తాళికట్టడం తర్వాత చేసే అతి ముఖ్యమైన ఆచారాల్లో మెట్టెలు కూడా ఒకటి. అయితే మెట్టెలు ధరించడం వెనక ఉన్న మరిన్ని సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

reasons behind wering toe rings..

 

  • కాలి బొటనవేలు పక్కనున్న వేలు స్త్రీలకూ ఆయువు పట్టు వంటిది. దాని నుంచి విద్యుత్ ప్రసరిస్తుంటుంది. కనుక ఆ వేలు నేలకు తగలడం మంచిది కాదని… అలా తగలకుండా ఉండటానికే మెట్టెలు ధరించే సంప్రదాయం వచ్చింది. వీటిని మధ్య మూడు వేళ్లలోని ఏదో ఒకదానికి లేదా, రెండింటికి ధరించడం ఆనవాయితీ.

  • ఆయుర్వేదం ప్రకారం బొటన వేలు పక్క ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుంది. మెట్టెలను ఈ వేలుకు ధరించడం వల్ల గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి, మహిళలు జననేంద్రియ సమస్యల నుంచి బయటపడతారు. ఈ వేలికి మెట్టె పెట్టుకోవడం వల్ల గర్భాశయం ధృఢపడుతుంది.

ambika marriage 2

  • వివాహమైన స్త్రీలు వీటిని పెట్టుకోవడం వల్ల రుతుక్రమ సమస్యలు దూరమవుతాయట.. మహిళల్లో రీ ప్రొడక్టివ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందట. దీని కారణంగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వివాహమైన స్త్రీలు కచ్చితంగా వీటిని ధరించాలని వారు సూచిస్తున్నారు.

reasons behind wering toe rings..

  • మెట్టెలు ఆక్యుప్రెజెర్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేసే నరాలపై ఇవి ఒత్తిడి తీసుకువస్తాయి. దీని వల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ మట్టెలను రెండో వేలుకు ధరించడం వల్ల మహిళల్లో లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది.

reasons behind wering toe rings..

  • వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల..భూమి నుండి ధనావేశాలను గ్రహించి శరీరానికి ప్రసరింపజేస్తుంది..అందుకే వెండితో చేసిన మెట్టలను మన భారతీయ స్త్రీలు కాలి రెండవ వేలుకు ధరిస్తారు.

reasons behind wering toe rings..

  • స్త్రీలు వారి చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాబివృద్ధికి, సుఖ ప్రసవం అవడానికి అనుకూలించే నాడులను సున్నితంగా నొక్కుతు ఉంటాయి.

reasons behind wering toe rings..

అందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ల మెట్టలు ధరించడం సంప్రదాయంగా చేర్చారు. ఈ మెట్టెలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు వధువు కాలి వేలుకి తోడుగుతాడు. వీటిని ఒక్కక్క ప్రాంతంలో ఒక్కోలా తొడుగుతారు. కొన్ని చోట్ల వదువు పుట్టింటి వాళ్ళు తొడిగితే మరి కొన్ని చోట్ల మెట్టినింటివారు పెడతారు.


End of Article

You may also like