Ads
ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న అంటే దీపావళి రోజున ఏర్పడబోతోంది. హిందూమతంలో గ్రహణం ఒక అశుభకరంగా భావిస్తారు. ఈ గ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం నిషేధం. ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడింది.
Video Advertisement
దీపావళి పండుగ రోజున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి.
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్వీయుజ అమవాస్య తిథి ముగిసిన తర్వాత, ఆ మరుసటి రోజు కార్తీక మాసంలో పాడ్యమి రోజున దీపావళి పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా వ్యాపారులు పాడ్యమి పర్వదినాన లక్ష్మీ పూజ చేస్తారు. ఆ మరుసటి గోవర్ధనుడి కూడా పూజిస్తారు. అంతేకాదు దీపావళి పండుగ రోజే ధన త్రయోదశి కూడా ప్రారంభమవుతుంది.
అయితే ఈ ఏడాది దీపావళి పండుగ రోజున సూర్యగ్రహణం వచ్చింది. 27 ఏళ్ల తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడబోతోంది. ఈసారి దీపావళి మరుసటి రోజే సూర్య గ్రహణం, సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సూర్య గ్రహణం వేళ లక్ష్మీ పూజను చేయొచ్చా.. ఈ సమయంలో గ్రహణం ప్రభావం ఉంటుందా లేదా అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం…
జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ సూర్య గ్రహణ ప్రభావం దీపావళి పండుగపై ఏ మాత్రం ఉండదని చెబుతున్నారు. ఈ సమయంలో లక్ష్మీ పూజలను చేసుకోవచ్చని సూచిస్తున్నారు. 25న అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుంది. ఆ రోజు అమావాస్య ఘడియలు ఉండవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు అంటున్నారు. 24న ఉదయమంతా చతుర్దశి ఉంటుంది. రాత్రంతా అమావాస్య ఉంటుంది. కాబట్టి 24న లక్ష్మీపూజ చేసుకుని, రాత్రి టపాసులు కాల్చి పండుగ జరుపుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే ఈ సూర్యగ్రహణ ప్రభావం మన దేశంపై ఎక్కువగా ఉండదట. గ్రహణం సమయంలో సూర్యుడు అస్తమించనున్నాడు. యూరప్, అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ తదితర దేశాల్లో ఈ సూర్యగ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుందట.
End of Article