వెన్ను నొప్పిగా ఉందా..?? నిర్లక్ష్యం చెయ్యకండి..!!

వెన్ను నొప్పిగా ఉందా..?? నిర్లక్ష్యం చెయ్యకండి..!!

by Anudeep

Ads

వెన్నునొప్పి అనేది అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వెన్ననొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది గృహ చికిత్సలతో సరిపెడుతూ ఉపశమనం పొందుతారు. అయితే మరికొందరిలో మాత్రం ఈ చికిత్సల వల్ల ఏమాత్రం ఫలితం ఉండకపోవటంతో వైద్యుల వద్దకు వెళుతున్నారు. వైద్యులు మందులతో నయమయ్యేదైతే అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. లేకుంటే మాత్రం శస్త్రచికిత్సను సూచిస్తున్నారు. ఇది చాలా అరుదుగా అవసరం అవుతుంది.

Video Advertisement

సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లాంటివి కారణాలు వెన్నునొప్పికి దారి తీస్తాయి. ఇవి కాకుండా ఆర్థరైటిస్‌, ఇన్‌ఫెక్షన్స్‌, ఫ్రాక్చర్లు, క్యాన్సర్‌ లాంటి వాటివల్లా తీవ్ర వెన్ను నొప్పి వస్తోంది. ఆడవాళ్ళల్లో కన్నా మగవాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కాల్‌సెంటర్లు, కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేవాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

is there any link to back pain with cancer..??
అయితే తరచూ వెన్నుముక నొప్పి వేధిస్తూ ఉంటే అది కాన్సర్ కి కారకమేమోనని గమనించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

# మూత్రశయ క్యాన్సర్

is there any link to back pain with cancer..??
మూత్రాశయం అనేది మీ పొత్తికడుపులో మూత్రాన్ని నివ్వ చేసే అవయవం. మీ వెనుక భాగంలో నొప్పి మూత్రాశయ క్యాన్సర్‌కి సంకేతం కావొచ్చు. యేల్ మెడిసిన్ ప్రకారం మీ మూత్రాశయంలోని లోతైన కణజాలంపై కణుతులు పెరగడం సర్వసాధారణం.

మూత్రశయ క్యాన్సర్ ఉంటే మూత్ర విసర్జన సమయంలో రక్తం, నొప్పి ఎక్కువగా ఉంటాయి. కింద వెన్నునొప్పి సాధారణంగా మూత్రాశయ క్యాన్సర్ కి సంకేతం. ఇది మూత్రాశయ క్యాన్సర్ ఇతర సంకేతాలతో సంభవిస్తే మీరు వెంటనే డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది.

# ​వెన్నెముక క్యాన్సర్

is there any link to back pain with cancer..??

మీ వెన్నెముక లోని క్యాన్సర్ కూడా వెన్నునొప్పికి కారణం కావొచ్చు. అయినప్పటికీ ఇది చాలా అరుదు. నొప్పి వెన్నెముకపై నిరపాయమైన కణితి వల్ల వస్తుంది. ఇది ఇతర శరీర భాగాలకు వ్యాప్తి చెందే ముప్పు ఉండదు. వెన్నెముక క్యాన్సర్ సంకేతాలలో తిమ్మిరి, బలహీనత, చేతులు, కాళ్ళలో సమన్వయ లోపం, పక్షవాతం కూడా ఉంటాయి

మూత్రాశయ క్యాన్సర్‌లా కాకుండా, వెన్నునొప్పి వెన్నెముక క్యాన్సర్‌కి ప్రారంభ సంకేతం. సంకేతాల కోసం చూడడం, రోగ నిర్ధారణ కోసం మీ వైద్యుడిని కలవడం చాలా ముఖ్యం. రోజుల మారే కొద్దీ ఈ నొప్పి తీవ్రమవుతుంది. శరీరంలోని కాళ్ళు, పాదాలు, చేతులకి కూడా వ్యాపిస్తుంది.

# ఊపిరితిత్తుల క్యాన్సర్

is there any link to back pain with cancer..??
లంగ్ క్యాన్సర్ అనేది వెన్నునొప్పి రూపంలో కనిపించే మరో సాధారణ క్యాన్సర్. మీరు వెన్నునొప్పితో, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏవైనా లక్షణాలను గమనిస్తే మీ డాక్టర్‌ని కలవడం చాలా ముఖ్యం.ఊపిరితిత్తుల క్యాన్సర్ విస్తృతంగా రెండు గ్రూపులుగా ఉంటుంది. చిన్న కణేతర ఊపిరితిత్తుల క్యాన్సర్, చిన్న కణ ఊపిరితిత్తుల క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ రూపం, చిన్న కణ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో రక్తంతో కూడిన దగ్గు, శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలంగా ఉండే దగ్గు మరింత తీవ్రమవుతుంది. రెండు, అంతకంటే ఎక్కువ వారాల పాటు దగ్గు ఉంటుంది.

వెన్నును ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు తక్కువ స్ధాయి ఎరోబిక్ వ్యాయామాలు రోజువారిగా చేయటం మంచిది. వెన్నుపై ఒత్తిడి కలిగించని వ్యాయామాలతో వెన్ను బలంగా మారి కండరాలు మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.

is there any link to back pain with cancer..??

అధిక బరువు వల్ల వెనుక కండరాలు ఇబ్బంది పడతాయి. మీరు అధిక బరువుతో ఉన్నట్లయితే, తగ్గించడం వల్ల వెన్నునొప్పిని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయటం వల్ల వెన్నునొప్పి దరి చేరకుండ చూసుకోవచ్చు. దూమపానం అలవాటుంటే దానిని వదిలేయండి. ధూమపానం నడుము నొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. కూర్చునే భంగిమల్లో మంచి లోయర్ బ్యాక్ సపోర్ట్, ఆర్మ్‌రెస్ట్‌లు మరియు స్వివెల్ బేస్ ఉన్న సీటును ఎంచుకోండి. బరువుగా ఎత్తవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

is there any link to back pain with cancer..??

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో జీవనశైలి కీ రోల్ పోషిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దాదాపు 30 నుంచి 40 శాతం క్యాన్సర్ ప్రమాదానికి జీవన శైలి కారకాలు కారణమని చెప్పొచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎక్కువగా పండ్లు, కూరగాయలు, మంచి ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వర్కౌట్, ఆరోగ్యకరమైన బరువు, ధూమపానానికి దూరంగా ఉండడం వంటివి చేయాలి.


End of Article

You may also like