1933 నాటి పెళ్లి పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసారో తెలుసా..?

1933 నాటి పెళ్లి పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసారో తెలుసా..?

by Anudeep

Ads

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పెళ్ళికి పెద్ద పీట వేశారు. ప్రతి ఏడాది పెళ్లిళ్ల సీజన్ లో ప్రజల హడావిడి మాములుగా ఉండదు. వివాహ పత్రికలు ముద్రించటం నుంచి పెళ్లి సందడి మొదలవుతుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకు తమ శుభలేఖను జీవితాంతం మధుర జ్ఞాపకంగా దాచి పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్నో రకాల ముద్రణాయంత్రాలు ఉన్నాయి. ఎన్నో రకాల డిజైన్ల శుభలేఖలు అచ్చు వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం చేతిరాతతో మొదటి శుభలేఖ రాసుకుని, ముద్రించేవారు.

Video Advertisement

ప్రస్తుతం మార్కెట్ లో 10 రూపాయల నుంచి 10 వేల రూపాయల దాకా కార్డులు వున్నాయి అంటే మీరు ఇక అర్ధం చేసుకోవచ్చు. అలాగే కొందరు వివాహ పత్రికలో అచ్చువేయబడిన మేటర్ విషయంలో కూడా చాలా ఖచ్చితంగా వుంటారు. ఎక్కడ అచ్చు తప్పులు వున్నా కార్డులు అన్ని రిటన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది.అలాగే కొంతమంది తమ ముత్తాతలనుండి….నేటి తరం వరకు పేర్లను అచ్చు వేస్తూ వుంటారు. ఇందులో ఎవరి టేస్ట్ వారిది.

a wedding card in 1933..

అయితే తాజాగా ఒక యువతీ తన ట్విట్టర్ ఖాతా లో 1933 లోని ఒక పెళ్లి శుభలేఖను పంచుకుంది. పాకిస్థాన్ లోకి కరాచీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సోన్యా బట్లా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఆమె తాత, నానమ్మ పెళ్లి ఢిల్లీలో జరిగింది. ఆమె పోస్ట్ చేసిన ఈ లేఖ ఫొటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఈ శుభలేఖ ఉర్దూలో ఉంది. ఆ పత్రిక ఉర్దూలో అందమైన చేతిరాతతో రాయడం కొసమెరుపు.ఉర్దూ కాలిగ్రఫీతో పాత కాగితంలా ఉంది ఆ పెళ్లి పత్రిక.

a wedding card in 1933..

దాన్ని కొందరు ట్రాన్సలేట్ చెయ్యగా.. ముహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి అప్పట్లో తన కుమారుడు హఫీజ్ ముహమ్మద్ యూసఫ్ పెళ్లి కోసం ఈ శుభలేఖ వేయించారని తెలిసింది. ఆ పెళ్లి 1933, ఏప్రిల్ 23లో జరగనున్నట్లు శుభలేఖలో ఉందని అన్నారు. ఢిల్లీలోని కసీమ్ జాన్ వీధిలో పెళ్లి జరుగుతుందని ఉందని చెప్పారు. పెళ్లి కూతురి చిరునామాగా కిషన్ గంజ్ ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ శుభలేఖ నెట్టింట వైరల్ గా మారింది.

 


End of Article

You may also like