Ads
ఈ సమాజం లో లావుగా ఉన్న అమ్మాయిలకు ఎదురయ్యే ప్రొబ్లెమ్స్ అన్నీ.. ఇన్ని కాదు.. షాపింగ్ దగ్గరి నుంచి.. వారు తినే తిండి వరకు అందరూ వీరికి సలహాలు ఇచ్చేవాళ్లే.. అయితే పెళ్లి దగ్గరికి వచ్చే సరికి ఈ విషయం మరింత సీరియస్ అవుతుంది. ముందుగా ఇంట్లో తల్లిదండ్రులే మనల్ని జడ్జ్ చెయ్యడం స్టార్ట్ చేస్తారు.
Video Advertisement
అయితే లావుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడరు. అమ్మాయిలు లావుగా ఉంటె పెళ్ళికి పనికి రారా అని కోరా లో ఒక ప్రశ్న వచ్చింది. ఒక ప్రశ్నకి ప్రపంచం మొత్తంలో ఎక్కడినుంచైనా సమాధానం దొరికే చోటు కోరా. ఇందులో ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు పోస్ట్ చేస్తే, దానికి ఎంతో మంది తాము ఏం అనుకుంటున్నాం అనేది వ్యక్తపరుస్తారు.
అయితే అమ్మాయిలు, ఊబకాయం, పెళ్లి కి సంబంధించిన ఈ ప్రశ్నని అందులో పోస్ట్ చెయ్యగా.. ఒక అబ్బాయి దానికి సమాధానం గా మరో ప్రశ్నని అడిగాడు. “ఎందుకు ఆస్తి తక్కువగా ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదు?” అని.
“ఎప్పుడు ఒక అమ్మాయి పెళ్లి గురించి, వారి సమస్యల గురించి మాట్లాడే సమాజం.. ఒక అబ్బాయికి ఆస్తి లేకపోతే పెళ్లి చేసుకోరా..డబ్బు తోనే ఒక అబ్బాయికి విలువ ఉంటుందా.. డబ్బు లేకపోతే ఒక అబ్బాయి పెళ్ళికి పనికి రాడా?” అంటూ కోరా లో ప్రశ్నించాడు ఒక యూజర్. తక్కువ శాలరీ వచ్చే అబ్బాయిలను పెళ్లి చేసుకోవద్దు.. అని ఏ భారతీయ చట్టం అయినా చెబుతోందా..? లేదు కాదా.. కానీ దానికి అమ్మాయిలు ఇష్టపడరు.
అమ్మాయిని కట్నం అడిగితే తప్పు అనే వారు.. అబ్బాయిలకి మాత్రం ఇన్ని లక్షల ప్యాకేజీ ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదా.. అని ఆ కోరా యూజర్ ప్రశ్నించారు. ఇందులో ఈక్వాలిటీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. దీనికి భిన్న స్పందనలు వస్తున్నాయి.
జీవితం నుండి ఆనందాన్ని పొందేందుకు మన ఆరోగ్యమే మార్గం. ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమే. జీవిత భాగస్వామి ఆరోగ్యంగా ఉండి, తమ జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే జీవిత భాగస్వామి మంచి వైవాహిక జీవితాన్ని గడపగలిగే అవకాశం ఉంది. ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి గౌరవం, ప్రేమాభిమానాలు ఉంటేనే ఆ బంధం కలకాలం వర్ధిల్లుతోంది.
End of Article