Ads
అంబాసిడర్ కార్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కార్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో కారులకు కింగ్ అని చెప్పవచ్చు. ఒకప్పటి కాలంలో అంబాసిడర్ కారు ఎవరి దగ్గర ఉంటే వారిని గొప్ప ధనవంతులు గా పేర్కొనేవారు. రాజకీయ నాయకుల నుండి పరిపాలనలో ఉన్న వ్యక్తుల వరకు అప్పట్లో విస్తృతంగా ఉపయోగించారు. ఇప్పటికీ చాలా మంది ఈ కారును ఉపయోగిస్తున్నారు.
Video Advertisement
హిందూస్థాన్ మోటార్స్ 1957లో అంబాసిడర్ కారును విడుదల చేసింది. ఇది బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించబడింది. ఈ కారు 80ల వరకు ప్రజల హృదయాలను ఏలింది. అయితే మారుతీ సుజుకీ వచ్చిన తర్వాత దాని ఆదరణ తగ్గింది. దీంతో 2014లో ఈ కారు ఉత్పత్తిని హిందుస్థాన్ మోటార్స్ నిలిపివేసింది. అయితే ఈ కార్ల ఉత్పత్తి నిలిపేయడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
హిందూస్తాన్ మోటార్స్ తయారు చేసిన ‘అంబాసిడర్’ భారతీయ ఆటోమేటివ్ చరిత్రలోనే అత్యంత ఎక్కువగా అమ్ముడైన ఉత్పత్తి అయిన కారుగా నిలిచింది. రోడ్ల రారాజుగా పిలువబడే అంబాసిడర్ భారతదేశపు మొట్టమొదటి డీజిల్ కారు. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అంబాసిడర్ కార్ మారుతున్న కాలం తో పోటీ పడలేకపోయింది. దాని ఇంజిన్ ని కూడా పాతదే వాడేవారు.
అయితే ఆ తర్వాత మార్కెట్ లోకి మారుతీ 800 వంటి కార్లు రావడం తో.. అంబాసిడర్ ని పక్కకి పెట్టేసారు ప్రజలు. రాను రాను అంబాసిడర్ కి మెయింటెనెన్స్ ఎక్కువ కావడం, ఇంజిన్ సౌండ్ పెరగటం వాటి సమస్యలు రావడం మొదలైంది. డిమాండ్ తగ్గటం తో హిందుస్థాన్ మోటార్స్ వీటి ఉత్పత్తిని నిలిపేసింది. కానీ దానికి గల కారణాలను వెతికే ప్రయత్నం చెయ్యలేదు. అలాగే మార్కెటింగ్ విషయం లో కూడా ఈ సంస్థ వెనుక బడటం తో అంబాసిడర్ పతనం ప్రారంభమైంది.
అప్పట్లో ఈ కార్లను ఎక్కువగా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఆ కాలం లో ప్రభుత్వ అధికారులు, నాయకులూ ఈ కార్లలోనే తిరిగే వారు. ప్రస్తుతం ఈ కార్లు కోల్కతా లో క్యాబ్ లుగా నడుస్తున్నాయి. అయితే లాభాలు వచ్చిన ప్రతిసారి హిందూస్తాన్ సంస్థ ప్రొడక్షన్ పెంచేది కానీ.. అంబాసిడర్లను మోడర్నైజ్ చెయ్యాలి అనుకోలేదు. దీంతో మార్కెట్లోని ఇతర కార్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపారు.
ఇక ప్రస్తుతం అంబాసిడర్ ఎలక్ట్రానిక్ కార్లు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్యుగోట్ సంస్థలు ఈ సరికొత్త అంబాసిడర్‌కు సంయుక్తంగా రూపకల్పన చేస్తున్నాయి. మరి దీంతో అయినా అంబాసిడర్ కి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి..
End of Article