Ads
భారత్‌కు స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లవుతోంది. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొస్తే.. ఇప్పుడు మనం హాయిగా బతుకుతున్నాం.
Video Advertisement
మీకు ఎంతరో స్వాతంత్య్రం సమరయోధులు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు ఖచ్చితంగా కొందరు వీర వనితల గురించి తెలుసుకోవాలి. కొన్ని వేల మంది మహిళలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు. వారిలో కొంత మంది చరిత్రలో నిలిచిపోయారు. భారత స్వాతంత్య్రం పోరాటంలో భాగస్వాములయ్యారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
#1 ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి
ఝాన్సీ రాణి అంటే వీరత్వానికి మరో పేరుగా మనం చెప్పుకుంటాం. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వీర మహిళల్లో ఆమె ఒకరు. భయం అనే పదానికి చోటే లేకుండా ఒంటరిగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. ఆమె తన కొడుకును వెనుక కట్టుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడింది.
అయితే చివరికి బ్రిటిష్ వారికి చిక్కడం కన్నా ప్రాణాలర్పించడం మంచిదని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఝాన్సీ రాణి లక్ష్మి బాయి చూపించిన సాహసం.. అనంతరం స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో ఝాన్సీరాణిలు రావడానికి స్ఫూర్తి అయింది.
#2 బేగం హజ్రత్ మహల్
బేగం హజ్రత్మహల్‌కు కూడా మహిళా స్వాతంత్య్ర సమరయోధుల్లో ప్రముఖురాలు. 1857లో, తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వచ్చారు. గ్రామీణ ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించడం లో కీలక పాత్ర పోషించారు.
#3 కస్తూర్బా గాంధీ
భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చెరగని పేరు కస్తూర్బా గాంధీ. జాతిపిత మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ సతీమణి అయిన ఈమె ప్రముఖ మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. పౌర హక్కుల కోసం పోరాడారు. ఇండిగో ప్లాంటర్స్ ఉద్యమం సమయంలో, పరిశుభ్రత, పరిశుభ్రత, ఆరోగ్యం, క్రమశిక్షణ, చదవడం , రాయడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర వహించారు.
#4 సరోజినీ నాయుడు
సరోజినీ నాయుుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరు. సరోజినీ నాయుడు స్వతంత్ర కవయిత్రి . శాసనోల్లంఘన ఉద్యమం , క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. జైలు శిక్ష కూడా అనుభవించారు.
#5 అరుణా అసఫ్ అలీ
అరుణా అసఫ్ అలీ ఉప్పు సత్యాగ్రహంలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో ఆమె పాల్గొనడం వల్ల జైలు శిక్ష కూడా అనుభవించారు.ఆమె జైలు నుండి విడుదలైన తర్వతా క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు.
#6 భికాజీ కామా
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు బికాజీకామా . ఆమెను మేడమ్ కామా అని కూడా పిలిచేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆమె భారతీయ పౌరుల మనస్సులలో మహిళా సమానత్వం , మహిళా సాధికారత గురించి ప్రధానంగా ప్రచారం చేసేవారు భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను స్థాపించిన మార్గదర్శకుల్లో ఆమె ఒకరు.
మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే.
#7 సావిత్రీబాయి ఫూలే
భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు విత్రీబాయి ఫూలే . మొదటి భారతీయ బాలికల పాఠశాల స్థాపకురాలు కూడా. ఆమె ప్రయాణంలో ఆమె భర్త జ్యోతిరావు ఫూలే ఆమెకు మద్దతుగా నిలిచారు. వారిద్దరూ అన్ని మూస పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడారు . సమాజంలో మహిళా సాధికారత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
#8 కిత్తూరు రాణి చెన్నమ్మ
మహిళా స్వాతంత్య్ర సమరయోధుల్లో చాలా మంది పేర్లకు ప్రాచుర్యం లభించలేదు. అలాంటి వారిలో ఒకరు కిత్తూరు రాణి చెన్నమ. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన కొద్దిమంది తొలి భారతీయ మహిళా పాలకులలో ఆమె ఒకరు.
ఆమె బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ఆమె సైన్యానికి నాయకత్వం వహించి యుద్ధరంగంలో ధైర్యంగా పోరాడింది. అయితే కిత్తూరు రాణి చెన్నమ్మ యుద్ధభూమిలో మరణించింది.
#9 కెప్టెన్ లక్ష్మీ సెహగల్
సుభాష్ చంద్రబోస్ చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రభావితమై లక్ష్మిసెహగల్..బ్రిటిష్ వారిపై పోరాటానికి వచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆమె మహోన్నతమైన వ్యక్తి. సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో క్రియాశీల సభ్యురాలు.
#10 దువ్వూరి సుబ్బమ్మ
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించి అరెస్ట్ అయిన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. కేవలం ఆందోళనల్లో పాల్గొనడం, ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా, తన గంభీర స్వరంతో పాటలు పాడుతూ అందరినీ ఆకర్షించిన నాయకురాలిగా సుబ్బమ్మ పేరు మారుమ్రోగింది.
End of Article