మటన్ తిన్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 పదార్థాలు తినకండి..! కాదని తీసుకుంటే ఇక అంతే..

మటన్ తిన్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 పదార్థాలు తినకండి..! కాదని తీసుకుంటే ఇక అంతే..

by kavitha

Ads

కరోనా సమయం నుండి మాంసం తినేవారు ఎక్కువ అయ్యారు. మటన్ ను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మటన్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఐరన్‌, బీ12 అధికంగా ఉండడంతో మటన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది.

Video Advertisement

బి 12 శరీరంలో అదనంగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సాయపడుతుంది. మటన్ తో తయారు చేసిన రుచికరమైన ఆహారాన్ని తిన్న తరువాత కొందరు పాలు త్రాగుతూ ఉంటారు. కానీ మటన్ తిన్న తరువాత పాలు త్రాగకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పాలతో పాటు మటన్ తిన్న తరువాత తినకూడని పదార్ధాలు ఏమిటో, ఎందుకో ఇప్పుడు చూద్దాం..dont eat these food after having meat1. పాలు: 

మటన్ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. మటన్  మరియు పాలు రెండింటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియ ప్రకీయ ఆలస్యం అవుతుంది. దానివల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట, అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలు వెంట వెంటనే తీసుకున్నప్పుడు శరీరం పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దీని వల్ల శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యతకు దారితీస్తుంది. మటన్, పాలు రెండు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, వీటిని కలిపి తినడం మాత్రం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మటన్ తీసుకున్న అనంతరం పాలు తాగకపోవడమే మంచిది.
2. తేనే: 

తేనెను సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. తేనే మంచి హీలింగ్ ఏజెంట్. ఇందులో విటమిన్లు, ఎన్నో పోషకాలు ఉన్నాయి.  ఇక మటన్ తిన్న తరువాత శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. తేనే కూడా వేడిని కలిగిస్తుంది. రెండింటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అయ్యి శరీరానికి హానిని కలిగిస్తుంది. అందువల్ల మటన్ తో కలిపి కానీ, మటన్ తిన్న తరువాత కానీ తేనే తీసుకోకూడదు. 3. టీ: 

చాలా మందికి  భోజనం చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ మటన్ తిన్న తరువాత వెంటనే టీ తాగవద్దు. మటన్ తిన్న తరువాత టీ తాగడం వల్ల కడుపులో అజీర్ణం, మంటను కలుగుతుంది.

Also Read: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..


End of Article

You may also like