ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..

ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వంకాయ తినకూడదంట.. అవి ఏమిటంటే..

by kavitha

Ads

కూరగాయాలలో రారాజు వంకాయ.వంకాయతో చేసిన వంటకాలు ఏవైనా చాలా రుచికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వీటిలో నాటు వంకాయలని, హైబ్రిడ్ వంకాయలని రెండు రకాలు ఉంటాయి. ఇక వీటిలో ఊదా రంగు, ఆకుపచ్చ, తెలుపు రంగు వంకాయలు కూడా ఉంటాయి.

Video Advertisement

వంకాయ ఎన్నో పోషకాలు కలిగిన కూరగాయ. ఇవి తినడం ఆరోగ్యాన్ని చాలా మంచిది. కానీ కొందరికి మాత్రం ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని వ్యాధులతో ఇబ్బందీ పడేవారు వంకాయ తినడం ద్వారా అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే ఎటువంటి వారు వంకాయను తినకూడదో ఇప్పుడు చూద్దాం..
Brinjal-side-effectsఆర్థరైటిస్ బాధితులు:
కీళ్లనొప్పులతో బాధపడేవారు కూడా వంకాయను దూరంగా ఉంచడం మంచిది. వంకాయ వల్ల కీళ్లనొప్పులు మరింత తీవ్రం అవుతుంది.Brinjal-side-effects2ఎముకలు బలహీనంగా ఉన్నవారు:
ఎముకలు బలహీనంగా ఉన్నవారు వంకాయను తినకూడదు. ఎందుకంటే వంకాయలో ఆక్సలేట్ ఉంటుంది. ఈ ఆక్సలేట్ వల్ల కాల్షియం శోషణ అనేది తగ్గుతుంది.ఇది ఎముకల ఆరోగ్యానికి ప్రమాదకరం.Brinjal-side-effects6పైల్స్ ఉన్నవారు:
పైల్స్ తో బాధపడేవారు కూడా వంకాయకు తినక పోవడం మంచిది. వంకాయ తినడం వల్ల ఆ సమస్యను ఎక్కువ చేస్తుంది.
Brinjal-side-effects3కిడ్నీ స్టోన్‌ సమస్య ఉన్నవారు:
కిడ్నీలలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నవారు వంకాయ తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు వంకాయ తీసుకోవడం వల్ల, వంకాయ గింజలు కిడ్నీలో స్టోన్స్ తయారవడానికి కారణం అవుతాయి. దానివల్ల కిడ్నీలు మరింత అనారోగ్యం బారిన పడుతాయి.Brinjal-side-effects1అతిగా వంకాయ తినడం:
వంకాయలు అతిగా తినడం కూడా ఆరోగ్యానికి హానికరమే. మితంగా తీసుకోవాలి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి,  వాంతులు, దురద వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Brinjal-side-effects5సర్జరీ అయినవారు: 
దెబ్బలు తగిలినపుడు, పుండ్లు లాంటివి అయినపుడు కూడా వంకాయ తినకూడదు. వంకాయ తినడం వల్ల వాటిపై ఎక్కువగా దురద వస్తుంటుంది. అలాగే సర్జరీ చేసిన తరువాత కుట్లు వేస్తారు. వంకాయ తినడం వల్ల కుట్లు వేసిన ప్రాంతంలో దురద వచ్చే ఛాన్స్ ఉంటుంది.  అందుకే డాక్టర్లు ఆపరేషన్ అయినవారికి పూర్తిగా తగ్గేవరకూ వంకాయని తినకూడదని సూచిస్తారు.Brinjal-side-effects4Also Read: వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..


End of Article

You may also like