వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..

వేసవి కాలంలో ఈ ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా చలవ కూడా చేస్తుంది..

by kavitha

Ads

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడి వల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారు. త్వరగా అలసిపోతారు. అందువల్ల కాలానికి తగ్గట్టుగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని, సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే తమ డైట్‌లో నీరు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Video Advertisement

ఈ ఫుడ్స్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అలగే రోజంతా ఎనర్జిటిక్‌గా కూడా ఉంచుతుంది. వీటిని తినడం ద్వారా శరీర బరువు తగ్గడమే కాకుండా శరీరానికి చల్లదనం కూడా కలుగుతుంది. మరి వేసవిలో బరువు తగ్గించే మరియు శరీరానికి చల్లదనం కలిగించే ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
జావ:
జొన్న పిండి, రాగి పిండితో చేసిన జావ, అంబలి వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.  వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటుగా చల్లగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  శరీరానికి శక్తి అందుతుంది.
పెరుగు:
ప్రో బయోటిక్ ఎక్కువగా లభించే పెరుగును తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగు జీర్ణ క్రియను పనితీరును మెరుగుపరచడమే కాకుండా కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పెరుగు తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు ధృడంగా మారతాయి. దీనిలో ఉండే ప్రోటీన్ బరువుని కంట్రోల్ చేస్తుంది.
​పుచ్చకాయ:
ఎండకాలంలో తీసుకోవాల్సిన పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.  పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిది. ఈ పండును తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా శరీరాన్ని చల్లపరుస్తుంది.  పుచ్చకాయలో ఉండే లైకోపిన్ చర్మాన్ని ఎండ నుండి కాపాడుతుంది.దోసకాయ:
దీనిలో నీటిశాతం ఎక్కువగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. దోసకాయలో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కంట్రోల్‌ గా ఉంటుంది. శరీరానికి  చల్లదనాన్ని కలుగ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ క్రియ పనితీరు మెరుగవాడమే కాకుండా మలబద్ధకం తగ్గుతుంది.
పనస పండు:
పనస పండు రుచితో పాటు శరీరానికి చల్లదనంను కూడా ఇస్తుంది. ఈ పండులో విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి.  ముఖ్యంగా దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండులోని పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీ పెంచి బలంగా చేస్తుంది.
Also Read: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక ఈ 7 తీసుకోండి..!


End of Article

You may also like