Ads
బుర్ర హీటెక్కిపోయి వర్క్ ప్రెజర్ నుంచి బయటపడేందుకు ప్రతీ ఒక్కరికీ కాస్త ఫ్రీ టైం ముఖ్యం. కొందరు తమ ఫ్రీ టైంను వెబ్ సిరీస్‌లు, మూవీస్‌తో గడిపేస్తుంటే.. మరికొందరు తమ మెదడుకు పని చెప్పాలని చూస్తారు. అందులో భాగంగానే సుడోకోలు, పజిల్స్ లాంటివి ఓ పట్టు పడుతుంటారు.
Video Advertisement
మన చిన్నప్పుడు పొదుపు కథలు కూడా ఇలాంటివే.. ప్రస్తుతం వీటిని గుర్తుపెట్టుకొని వారు తక్కువయ్యారు. వీటి వల్ల మెదడుకు మేత.. వీటిని నిత్యం ప్రాక్టీస్ చెయ్యడం వల్ల మెదడు చురుగ్గా అవుతుంది. అయితే మీకోసం ఇప్పుడొక చిక్కు ప్రశ్న తీసుకొచ్చా దానికి సమాధానం చెప్పుకోండి చూద్దాం..
మీరు ఒక బస్సు లో ప్రయాణిస్తున్నారు. మీతో పాటు మరో పది మంది కూడా బస్ లో ఉన్నారు. మొదటి స్టాప్ దగ్గర ఇద్దరు దిగిపోయారు.. నలుగురు బస్సు ఎక్కారు. రెండో స్టాప్ లో ముగ్గురు దిగేసారు.. ఆరుగురు బస్సు ఎక్కారు.. మూడవ స్టాప్ దగ్గర నలుగురు బస్సు దిగారు.. ఎనిమిది మంది బస్సు ఎక్కారు. అయితే ప్రస్తుతం బస్సు లో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో చెప్పుకోండి..
ఒక ఇరవై సెకన్ల సమయం తీసుకొని సమాధానం చెప్పండి..
ఈ ప్రశ్నకి సమాధానం ఇరవై.. బస్సు లో ఉన్న మీతో, డ్రైవర్, కండక్టర్ తో కలిపి మొత్తం ఉన్నది ఇరవై మంది.
అదెలా అంటే.. మొదట బస్సు లో 10 మంది ఉన్నారు. మీతో కలిపి 11 మంది. ఫస్ట్ స్టాప్ లో ఇద్దరు దిగిపోయారు. అంటే 9 మంది ఉంటారు. అప్పుడు నలుగురు ఎక్కుతారు. అంటే 13 మంది ఉంటారు. రెండో స్టాప్ లో ముగ్గురు దిగుతారు అంటే 10 మంది ఉంటారు. తర్వాత ఆరుగురు ఎక్కుతారు. అంటే 16 మంది ఉన్నట్టు. ఇప్పుడు మూడో స్టాప్ లో నలుగురు బస్సు దిగుతారు. అంటే 12 మంది ఉంటారు. అప్పుడు ఎనిమిది మంది ఎక్కుతారు. అంటే మొత్తం బస్సు లో ప్రస్తుతం ఉన్నది 20 మంది. ఇదే ఈ ప్రశ్నకు సమాధానం.
End of Article