Ads
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు, ప్రధాని మోదీ అధ్యానం (సాధువుల) సమక్షంలో చారిత్రాత్మక ‘సెంగోల్’ను ఏర్పాటు చేశారు. అంతకు ముందు, శనివారం (మే 27) తమిళనాడు నుంచి వచ్చిన అధినం ( తమిళనాడులోని శైవ మఠాలు) ఈ చారిత్రాత్మక దండను ప్రధాని మోడీకి అందజేశారు.
Video Advertisement
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. లోక్‌సభలో స్పీకర్ సీటు పక్కన సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. సెంగోల్ అనే పదం సెమ్మై అనే తమిళ పదం నుండి వచ్చింది. దీని అర్థం – నైతికత అని అర్థం. ఇప్పుడు సెంగోల్ దేశం పవిత్ర జాతీయ చిహ్నంగా పిలువబడుతుంది.
తమిళనాడులోని చోళ రాజ్యం భారతదేశంలోని పురాతన రాజ్యం. అప్పుడు చోళ చక్రవర్తి సెంగోల్‌ను అప్పగించడం ద్వారా అధికారాన్ని బదిలీ చేసేవాడు. శివుడిని ఆవాహన చేసుకుంటూ రాజుకు అప్పగించారు. రాజ గోపాలాచారి ఈ సంప్రదాయాన్ని నెహ్రూకు చెప్పారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సెంగోల్ సంప్రదాయం ప్రకారం అధికార మార్పిడిని అంగీకరించారు.
దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్.. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అందించారు.
5 అడుగులకు పైగా పొడవు ఉండి.. పైన నంది చిహ్నం కలిగిన ఈ రాజదండం.. బంగారు పూత కలిగిన వెండి దండం. నంది చిహ్నం న్యాయం, ధర్మానికి గుర్తు. దీన్ని తమిళనాడుకి చెందిన ఉమ్మిడి ఎతిరాజు అనే స్వర్ణకారుడు 20 ఏళ్ళ వయసులో తన సోదరుడితో కలిసి తయారు చేసారు.
ఉమ్మిడి ఎతిరాజు కుటుంబాన్ని ఈ సెంగోల్ ప్రతిష్టాపనకు ప్రధాని మోడీ ఆహ్వానించారు. 95 ఏళ్ళ ఎతిరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు తమిళనాడు లోని ప్రసిద్ధి చెందిన నగల వర్తకులు. ఉమ్మిడి ఎతిరాజు తన 20 ఏళ్ల వయసులో తన సోదరుడితో కలిసి బంగారు సెంగోల్‌ను తయారు చేశాడు.
గతంలో ఈ రాజదండం గుజరాత్‌లోని అలహాబాద్ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబర్ 4న అక్కడ నుంచి ఢిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు.
End of Article