“కెప్టెన్ కూల్ ధోని” డైట్ ప్లాన్ ఏంటో తెలుసా..??

“కెప్టెన్ కూల్ ధోని” డైట్ ప్లాన్ ఏంటో తెలుసా..??

by Anudeep

Ads

మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ గురించి కాస్తో కూస్తో తెలిసిన వాళ్లకు కూడా పరిచయం అక్కర్లేని పేరు ఇది. అనామకుడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్‌గా భారత్‌కు తిరుగులేని విజయాలు అందించిన ఆటగాడు ధోనీ. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆలోచిస్తూ.. మిస్టర్ కూల్‌గా పేరొందాడు.

Video Advertisement

 

 

క్రికెట్ చరిత్రలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనీ. మహీ కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ నెగ్గింది. రెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది. టెస్టుల్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలిపిన తొలి కెప్టెన్ ధోనీనే. ప్రపంచ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో క్రేజ్ ఉంది. కోట్లాది మంది ధోనీని అభిమానిస్తుంటారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

know about MS dhoni diet..!!

41 ఏళ్ళ వయసులో కూడా ధోని ఐపీఎల్ లో చెన్నై జట్టుని విజయం వైపు నడిపించాడు. అయితే ఈ విజయవంతమైన కెప్టెన్ ఏం తింటాడు.. ఎలా వర్కౌట్ చేస్తాడు అని అందరికి ఆసక్తిగా ఉంటుంది. తన బాడీని పూర్తిగా ఫిట్ గా ఉంచేందుకు ఏయే డైట్ సీక్రెట్స్ ఫాలో అవుతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

 

ధోనీ ఎక్కువగా భారతీయ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే బయటి ఫుడ్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాడు ధోని.

# బ్రేక్ఫాస్ట్

సాధారణంగా ధోని బ్రేక్ ఫాస్ట్ లో కార్న్‌ఫ్లేక్స్ లేదా సూప్. ఒక గ్లాసు పాలు, హోల్ వీట్ బ్రెడ్ తీసుకుంటాడు.

know about MS dhoni diet..!!

# లంచ్

మధ్యాహ్న భోజనం కోసం ధోని పప్పు లేదా చికెన్‌తో చపాతీలు తింటాడు. పోషకాలు, ఫైబర్ కోసం మిక్స్ వెజిటబుల్ సలాడ్ తింటాడు. ఒక్కోసారి చపాతీ బదులు అన్నం కూర, పెరుగు తింటాడు.

know about MS dhoni diet..!!

# డిన్నర్

డిన్నర్లో చపాతీలు తింటాడు. అలాగే ఫ్రూట్ లేదా వెజిటబుల్ సలాడ్ తింటాడు.

know about MS dhoni diet..!!

# స్నాక్స్

వర్కౌట్‌కు ముందు ధోని ఒక గ్లాసు తాజా పండ్ల రసం లేదా ప్రోటీన్ షేక్ తీసుకుంటారు. మధ్యలో జున్ను లేదా ఏదైనా ఫ్రూట్, సాధారణ శాండ్‌విచ్ తింటాడు.

know about MS dhoni diet..!!

ధోని శీతల పానీయాలకు దూరంగా ఉంటాడు. అలాగే అప్పుడప్పుడు తనకు ఇష్టమైన బటర్ చికెన్ తింటాడు. వీటితో పాటు ధోని వర్కౌట్స్ చెయ్యడం వల్లే అంత ఫిట్ గా ఉన్నాడు.

know about MS dhoni diet..!!

ఓవరాల్ ఫిట్‌నెస్ కోసం ధోని జిమ్ లో కార్డియో, ఇతర వ్యాయామాలు చేస్తాడు. లేదా ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఆడతాడు.

Also read: అప్పుడు “షేన్ వార్న్”… ఇప్పుడు “ధోనీ”..! ఇలాంటి ఘనత వీరికే సాధ్యం ఏమో..!


End of Article

You may also like