Ads
ప్రముఖ కార్డియాలజిస్ట్ గౌరవ్ గాంధీ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు అనే సంగతి తెలిసిందే. ఎన్నో వేల మందికి గాంధీ గుండె ఆపరేషన్ చేశారు. అలాంటిది గాంధీ గుండెపోటుతో మరణించారు అని తెలిసి అందరూ దిగ్బ్రాంతికి లోనయ్యారు.
Video Advertisement
గుండె సంబంధిత సమస్యలకు చికిత్స అందించే డాక్టర్, కేవలం 41 సంవత్సరాల వయసులో గుండె సంబంధిత సమస్యతో మృతి చెందడం ఏంటి అని అన్నారు. అయితే దీనికి కారణం ఇదే అని కొంత మంది నిపుణులు అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక హార్ట్ స్పెషలిస్ట్ వివరించారు.
ఆయన ఏం చెప్పారంటే, “కొన్ని రోజుల క్రితం గాంధీకి రాత్రిపూట గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు ఆయన వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. పొట్టపై భాగంలో గాంధీకి నొప్పి వచ్చింది. ఈసీజీ లో నార్మల్ అని వచ్చింది. అది మాత్రమే కాకుండా ట్రోపోనిన్ అనే ఒక రక్త పరీక్ష కూడా చేయించారు. ఇది చాలా సెన్సిటివ్ పరీక్ష. ఇది నెగిటివ్ వస్తే హార్ట్ ఎటాక్ ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఈ పరీక్ష కూడా నెగిటివ్ వచ్చింది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు”.
“ఆ తర్వాత మళ్లీ నొప్పి రావడంతో మళ్లీ ఈసీజీ తీయించుకున్నారు. అందులో కూడా నార్మల్ వచ్చింది. దాంతో కడుపులో మంట కోసం అందరూ వాడే మెడిసిన్ వాడి ఆయన ఇంటికి వెళ్లిపోయి పడుకున్నారు. కానీ తర్వాతి రోజు ఆయన చనిపోయారు” అని అన్నారు. ఈ విషయంపై మరొక డాక్టర్ మాట్లాడుతూ అసలు కార్డియాలజిస్ట్ కి ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది అనే విషయంపై సమాధానం చెప్పారు. “సాధారణంగా గుండె సంబంధిత సమస్యలు రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి”.
“బరువు బీపీ ఇలాంటివన్నీ కూడా ఆ వైద్యులు తమ అదుపులో పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ కూడా కార్డియాలజిస్టులు జాగ్రత్తగా పెట్టుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కార్డియాలజిస్టులు మిగిలిన వారితో పోలిస్తే కొంచెం వెనకబడి ఉంటారు. అందులో ఒకటి మానసిక ఒత్తిడి. వారికి మానసిక ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. కార్డియాలజిస్టులు చేసే పని అలా ఉంటుంది”.
“వారు ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు, అక్కడ టేబుల్ మీద ఉన్న పేషెంట్ కి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా రిజల్ట్ మారే అవకాశం ఉంటుంది. దాంతో వారు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ విషయంపై వారికి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే నిద్ర. ఈ నిద్ర విషయంలో వారికి చాలా సమస్యలు ఎదురవుతాయి”.
“సాధారణంగా పడుకునేటప్పుడు అందరూ ఫోన్ సైలెంట్ లో పెట్టి పడుకుంటారు కానీ కార్డియాలజిస్టులు మాత్రం ఫోన్ సైలెంట్ లో పెట్టకుండా వారి పక్కనే పెట్టుకొని పడుకుంటారు. ఎందుకంటే ఏ సమయంలో ఇలాంటి ఎమర్జెన్సీ వస్తుంది అనేది తెలియదు. ఇవన్నీ వృత్తిపరంగా వచ్చే కొన్ని ఇబ్బందులు. అందుకే కార్డియాలజిస్టులకి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి” అని ఈ విషయంపై వివరంగా చెప్పారు.
watch video :
ALSO READ : నిద్ర పోయే ముందు ఫోన్ చూస్తున్నారా..? దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
End of Article