సౌదీలో ఆడవాళ్ళు చేయకూడని 5 పనులు ఏమిటో తెలుసా..?

సౌదీలో ఆడవాళ్ళు చేయకూడని 5 పనులు ఏమిటో తెలుసా..?

by kavitha

Ads

సౌదీ అరేబియా పేరు వింటేనే కఠినమైన రూల్స్ గుర్తుకు వస్తాయి. ఆ దేశంలోని స్త్రీల పై ఉండే వివక్ష కూడా ఎక్కువే.  కాదు. ఎన్నో ఆంక్షలు ఉంటాయి. అయితే సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజిజ్ ఇక నుండి సౌదీ మహిళలు కూడా డ్రైవింగ్ చేయవచ్చని అనౌన్స్ మెంట్ చేసినపుడు అది పెద్ద సంచలనంగా మారింది.

Video Advertisement

ఈ వార్తతో సౌదీ మహిళల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. దానికి సౌదీ అరేబియాలో ఉన్న నిబంధనలు మరెక్కడా ఉండవు. ఇటీవలే మహిళలను స్టేడియంలోకి అనుమతించారు. ఇది సౌదీ చరిత్రలో తొలిసారి. ఆ తర్వాత మహిళలకు డ్రైవింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సౌదీలో ఆడవాళ్ళు చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Saudi-Arabia-Rules-For-Women-3పురుషుల అనుమతి:

సౌదీలో స్త్రీలు ఎక్కడికి వెళ్లాలంటే వారి వెంట తప్పనిసరిగా వారికి ఫ్యామిలికి చెందిన మగవారు ఉండాలి. తమ గార్డియన్స్ పర్మిషన్ లేకుండా మహిళలు వివాహం చేసుకోకూడదు. అలాగే విడాకులు కూడా ఇవ్వకూడదు. వారి అనుమతి లేనిదే పాస్ పోర్టు తీసుకోకూడదు. ప్రయాణాలు కూడా చేయకూడదు. బ్యాంకులో ఖాతాలు తెరవకూడదు. చికిత్స తీసుకోకూడదు. మహిళలు తమ బంధువులు కాని పురుషులతో తిరగకూడదు. లీగల్ మేల్ గార్డియన్ లేకుండా స్త్రీలు ఏ పని చేయకూడదు. సౌదీ స్త్రీలకు తండ్రి, ఆ తర్వాత సోదరులు, భర్త, కొడుకులు గార్డియన్‌గా ఉండాలి.
అందం బయటకు ప్రదర్శించకూడదు:

సౌదీ స్త్రీలు బహిరంగ ప్రాంతాలలో తల నుండి కాళ్ల వరకు బురఖా ధరించాలి. మహిళల ఏ భాగం బయటకు కనిపించకూడదు. తమ శరీర భాగాలు బయటకు ఎంత వరకూ కనపడాలి అనే విషయంలో ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. కొన్ని రకాల వ్యాపారాలు చేయకూడదు.
స్విమ్మింగ్ చేయకూడదు:

మహిళలు పబ్లిక్ గా స్విమ్మింగ్ చేయకూడదు. పబ్లిక్ జిమ్ లలో, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లో మహిళలకు అనుమతి లేదు. కానీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన జిమ్స్ కు, పూల్స్ కు వెళ్లొచ్చు.
పరాయి మగవారితో మాట్లాడకూడదు:

బయట వ్యక్తులతో స్త్రీలు మాట్లాడకూడదు. ఇప్పటి వరకు మహిళలు హాస్పటల్, బ్యాంకుల్లోనూ లేడీ స్టాఫ్ తో మాత్రమే మాట్లాడాలి.
కొనే డ్రెస్ లను ట్రై చేయకూడదు:

సాధారణంగా షాపింగ్ కి వెళ్లిన సమయంలో దుస్తుల కొనాలంటే వాటిని ట్రై చేస్తుంటారు. కానీ సౌదీలో మహిళలు  కొనే డ్రెస్ లను ట్రయల్ రూమ్ కి వెళ్లి చెక్ చేసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే అది నేరం.
ఇవేకాకుండా మహిళలకు ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. కొన్ని రకాల బిజినెస్ లు చేయకూడదు. అప్పు తీసుకోవాలన్నా, లైసెన్సు ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఆమె క్యారెక్టర్ పై ఎలాంటి మచ్చలేదు అని ఇద్దరు పురుషులు ధ్రువీకరించాలి. బహిరంగ ప్రదేశాల్లో ఫ్యామిలీ మెంబర్స్ తో అయినా కలివిడిగా ఉండకూడదు. స్పెషల్ ఫ్యామిలీ సెక్షన్ లేని హోటేల్స్ లో  తినకూడదు.

Also Read: నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?

 

 

 


End of Article

You may also like