Ads
మనలో చాలా మందికి బస్సు లో వెళ్లడం, కార్ లో వెళ్లడం అంటే అంత ఇష్టం ఉండదు. దానికి కారణం బస్సు , కార్ పడకపోవడం వలన వాంతులు అవుతుండడమే. కానీ దీనికి అసలు కారణం ఏంటో తెలుసా..? కేవలం బస్సు, కార్ లలోనే కాదు.. రైలు, ఏరోప్లేన్, వంటి వాటిల్లో కూడా ప్రయాణం అంటే వాంతులు చేసుకునే వారు ఉంటారు.. దీనిని మోషన్ సిక్ నెస్ అని పిలుస్తుంటారు.. అయితే.. కేవలం ప్రయాణాల్లో ఇలా ఎందుకు జరుగుతుంది..?
Video Advertisement
ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండకపోయినా… కనీసం ముగ్గురి లో ఒకరికి ఉండే అవకాశం ఉంటుంది. ఇదేదో నార్మల్ అనుకుని చాలా మంది పట్టించుకోరు. కానీ ఇది కచ్చితం గా ఆలోచించుకోవాల్సిన సమస్య. సాధారణం గా 2 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలలో, ఆడవారిలో ఈ సమస్య ఎక్కువ గా కనిపించే అవకాశం ఉంటుంది. ఆడవారితో పోలిస్తే.. మగవారిలో ఈ సమస్య తక్కువ గా ఉంటుంది. చిన్న పిల్లలలోను, ఆడవారిలోను సెన్సిటివ్ నెస్ ఎక్కువ గా ఉండడం వలన ఇలా జరుగుతుంది.
ప్రయాణం అంటే చాలు వాంతులైపోతాయేమో అన్న భ్రాంతి కూడా చాలా మందిలో ఉంటుంది. ప్రయాణం లో ఉన్నట్లుండి వాంతులు అయిపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే.. ఇలా వాంతులు అవడానికి చెవిలో ఉండే “లాబ్రింథైస్” అనే భాగం కారణం అని వైద్యులు చెబుతున్నారు. ఈ భాగం శుభ్రం గా లేని సమయం లోను, సమతా స్థితిలో లేకుండా ఏ చిన్న ఇబ్బంది కలిగినా వాంతులు అయ్యే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. స్నానం చేసేటపుడు చెవులను కూడా నిత్యం శుభ్రపరుచుకోవాలి. అలా చెయ్యని వారిలో ఈ సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉంది.
సబ్బుతో మీ ముఖాన్ని కడుక్కున్నపుడు చెవుల్లో నురగ ఉండిపోతుంది. దానిని సరిగ్గా శుభ్రపరుచుకోకపోతే.. చెవిలోని లాబ్రింథైస్ భాగం లోని సమతా స్థితి చెడిపోతుంది. ఫలితం గా వాంతులొస్తు ఉంటాయి. చెవిలోపల భాగం గదులు గదులు గా ఉంటుంది. ఈ గదులు ద్రవ్యాలతో నిండి ఉంటాయి. కోక్లియా , వెస్టిబ్యూల్, అర్ధ వృత్తవలయాలు అని మూడు భాగాలూ ఉంటాయి. కోక్లియా అనే భాగం శబ్దాలను సంకేతాలుగా మార్చి మెదడుకు పంపిస్తుంది. ఈ భాగం లోనే లాబ్రింథైస్ ఉంటుంది. దీనిని శుభ్రం గా ఉంచుకోవాలి.
ప్రయాణం లో తరచూ గా వేగం మారుతుండడం, ఒడిదుడుకులకు లోనవడం వలన కూడా ఈ లాబ్రింథైస్ భాగం లో సమతా స్థితి దెబ్బ తిని వాంతులు వస్తాయి. జనరల్ గా ఇలా వాంతులు వస్తాయని ముందే తెలిసిన వారు నిమ్మకాయలు దగ్గర ఉంచుకుంటుంటారు. ఇందులో ఉండే అసిడిక్ నేచర్ కారణం గా ఉపశమనం లభిస్తూ ఉంటుంది. కాపర్, ఐరన్, జింక్ వంటివి ఉండే అల్లం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఉన్నట్లుండి వాంతి అవబోతున్నట్లు అనిపిస్తే మీ చేతి బొటన వేలు, మణికట్టు కలిసే చోట రబ్ చేస్తూ ఉండడం వలన కూడా ఉపశమనం పొందొచ్చు.
ఈ సమస్యను శాశ్వతం గా పరిష్కరించుకోవడానికి మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. పది, పదిహేను రోజుల పాటు వైద్యులు సూచించిన దాని ప్రకారం వాడటం వలన పూర్తి గా బయటపడచ్చు.
End of Article