Ads
ఇటీవల కాలంలో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిల్లలు చేసే చిలిపి చేష్టలు అందరిని అలరిస్తున్నాయి. ఈ పిల్లల వీడియోలను చూసినప్పుడు ఒత్తిడిని మరచిపోతుంటాము. పిల్లలు ఏదైనా చేయడం కోసం పేరెంట్స్ ను ఒప్పించడానికి, తమకు ఇష్టమైన బొమ్మలు కొనిపించుకోవడం కోసం మాట్లాడే మాటలు.
Video Advertisement
స్కూల్ ఎగ్గొట్టడానికి అయితే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, టీవీ చూడటం కోసం, చాక్లెట్ల కోసం పిల్లలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రతి పిల్లాడు దాదాపు ఇలానే ఉంటారు. ఇక అలాంటి ఒక ఆరేళ్ల పిల్లాడు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. దానికి కారణం ఆ పిల్లాడు రాసుకున్న టైమ్ టేబుల్. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒక ఆరేళ్ల బాబు రోజు తాను చేయాలనుకున్న పనులతో ఒక టైం టేబుల్ ను తయారుచేసుకున్నాడు. దానిలో ఆడుకోవడానికి, చదువుకోవడానికి, తినడానికి ఇలా అన్ని పనులకి సమయం కేటాయిస్తూ రాసుకున్న టైం టేబుల్ ను ఆ పిల్లాడి బంధువు ఒకరు సామాజిక మాధ్యమంలో షేర్ చేయడంతో ఆ టైం టేబుల్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
లైబా అనే ట్విటర్ యూజర్ తన ఖాతాలో ఆ పిల్లాడి టైం టేబుల్ ను పోస్టు షేర్ చేశారు. టైం టేబుల్ ను చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆ ఆరేళ్ల పిల్లాడు తన క్రియేటివీటితో 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ తయారుచేసుకున్నాడు. అందులో ఈ పిల్లాడు చేయాల్సిన అన్ని పనులకు ఎక్కువ సమయంను కేటాయించాడు. కానీ చదువుకునేందుకు మాత్రం 15 నిముషాలే కేటాయించాడు. ఈ విషయమే అందరిని నవ్విస్తోంది.
ఆ పిల్లాడు టైమ్ టేబుల్‌లో నిద్ర లేచిన దగ్గర నుండి వాష్‌రూమ్, బ్రేక్‌ఫాస్ట్, స్నానం చేసే సమయం, టీవీ టైమ్, లంచ్, ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం నిద్రించే సమయం అంటూ అన్నింటికీ ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. కానీ చదువుకునేందుకు 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇక ఈ పోస్టుకు ఇప్పటి దాకా 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
My 6 year old cousin made this timetable…Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI
— Laiba (@Laiiiibaaaa) June 22, 2023
Also Read: ఏదో చేద్దాం అనుకున్నాడు… ఏదో అయ్యింది..? అసలు ఏం జరిగిందంటే..?
End of Article