Ads
ఇటీవల కాలంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్న వ్యక్తుల గురించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండెపోటు రావడంతో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోతూ కనిపించారు. మరొక వీడియోలో ఫ్రెండ్స్ తో కలిసి నడుస్తున్న ఒక వ్యక్తి గుండెపోటు రావడంతో అలాగే నేలపై కుప్పకూలి కన్నుమూశారు.
Video Advertisement
ఇక రీసెంట్ గా ఒక వ్యక్తి ద్వారకా తిరుపతికి గుడిలో నడుస్తుండగా గుడిలోనే గుండెపోటు రావడంతో, దగ్గరలోని హాస్పటల్ కి తీసుకెళ్ళే క్రమంలోనే ఆ వ్యక్తి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తిరుపతి లాంటి గుడులకి కాలినడకన వెళ్ళినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ ముఖర్జీ మరియు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ ఒక వీడియోలో తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇటీవల కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండెలోని రక్త నాళాలలో రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడటం లేదా రక్తనాళాలు పూడుకుపోవడం తదితర కారణాలతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్ ముఖర్జీ మరియు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ ఒక వీడియోలో మాట్లాడుతూ తమ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒకరు చెప్పిన విషయన్ని పంచుకుంటూ, అదే సమయంలో గుడికి వెళ్ళినపుడు గుండెపోటు వచ్చినపుడు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపారు. ద్వారకా తిరుపతికి వెళ్ళిన ఒక మహిళ ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పడిపోయింది.అప్పుడు ఆమె కుటుంబ సభ్యులకు సీపీఆర్ చేయడం పై కొంత అవగాహన ఉండడంతో ఆమెకు సీపీఆర్ చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారని డాక్టర్ ముఖర్జీ తెలిపారు. ఈ క్రమంలోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించారు. ఈ విషయం గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే క్రింద ఉన్న వీడియోని చూడండి..
watch video:
Also Read: కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలిస్తే ఇంకెప్పుడు అలా చేయరు..!
End of Article