Ads
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బియ్యం కోసం బారులు తీరిన ప్రవాస భారతీయుల వీడియోలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇండియా బాస్మతి రైస్ మినహా మిగిలిన అన్ని రకాల రైస్ ఎక్స్పోర్ట్ నిలిపివేయడం.
Video Advertisement
ఇది చూసిన ఎవరికైనా అసలు ఎందుకు ఎక్స్పోర్ట్ నిలిపివేశారు అన్న ప్రశ్న కలగక మానదు. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా గురువారం సడన్‌గా భారత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది.
తమ సరఫరా పెంచడానికి, ఇన్ఫ్లమేషన్ సమస్య తగ్గించడానికి ఎగుమతులపై తక్షణం ఇలా నిషేధం విధించడం జరిగింది. భారత్ సర్కార్ 10 నెలల క్రితం ఈ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం పెంచి ఆంక్షలు విధించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు కాబట్టి ఈ రకంగా ఎగుమతిని నిషేధించక తప్పలేదు. అయితే భారత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ప్రపంచానికి ప్రాణ సంకటంగా మారింది.
ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసేది భారతదేశం నుంచే. ప్రపంచం మొత్తం మీద వాడుతున్న బియ్యంలో 40 శాతం కు పైగా మన దేశం నుంచి ఎగుమతి చేయబడినవే. అయితే ప్రస్తుతం మన దేశంలో వరి ఉత్పత్తి కాస్త తలబడుతుంది.. పంజాబ్ మరియు హర్యానా లాంటి ప్రదేశాలలో భారీ వర్షాలకు పంట దెబ్బతింది. మరోపక్క సరి అయిన వర్షాలు లేక కర్ణాటక ,పశ్చిమ బెంగాల్ ,ఛత్తీస్గడ్ మరియు తమిళనాడు లాంటి ప్రదేశాలలో నాట్లు వేయడం బాగా ఆలస్యం అయింది కాబట్టి పంట చేతికి వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుంది.
కాబట్టి మనకు బియ్యం కొరత వచ్చే అవకాశం ఉంది అని భావించారు కాబట్టే ఎగుమతులను నిలిపివేశారు. ఇలా ఎగుమతి నిలిపివేయడంపై దేశంలోని ఎగుమతి దారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిషేధం కేవలం తాత్కాలికమై అని.. ఆరు నెలలకు మించి ఉండకపోవచ్చు అని అంచనా. మరోపక్క భారత్ బియ్యం యుగమతి ఆపివేయడంతో మిగిలిన దేశాల నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ధరలు బాగా పెరిగాయి.
ALSO READ : ప్రేమకి ఎలాంటి హద్దులు కూడా అడ్డు కాదు ఏమో..! వీరి కథ ఏంటంటే..?
End of Article