దేవుడి విగ్రహాల అభిషేకానికి పాలు వృధా చేస్తున్నాం అంటారు..! కానీ ఈ విషయం ఆలోచించారా..?

దేవుడి విగ్రహాల అభిషేకానికి పాలు వృధా చేస్తున్నాం అంటారు..! కానీ ఈ విషయం ఆలోచించారా..?

by Anudeep

Ads

సాధారణంగా మనకు బాగా నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లెక్సీలకు పాలు పోస్తారు. ఇంకొందరైతే బర్త్డేకి కేక్ కట్ చేసి మొహానికి పూసుకుంటారు. కొందరు తిన్న ఆహారాన్ని సగం వొదిలేసి ఫుడ్ వేస్ట్ చేస్తారు. ఎంటని అడిగితే ఇది నా లైఫ్ నా ఇష్టమని, నికొచ్చిన నొప్పేంటని, నేను అనందిస్తే నువ్వు ఓర్వలేక పోతున్నావు ఏవేవో అంటుంటారు.

Video Advertisement

ప్రత్యేకంగా చెప్పాలంటే నేటి తరం యువత ఎవరైనా జడ్జ్ చేసినట్టు మాట్లాడితే అసలు ఓర్చుకొలేరు. కానీ అదే హిందూ ధర్మం వెనక ఉన్న సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే కాస్త వెనక్కి తగ్గుతారు… కారణం వాళ్ళకి అసలైన పద్దతులు తెలియవు కాబట్టి.

god

ఇదంతా పక్కన పెడితే అసలు గుళ్ళల్లో దేవుని విగ్రహాలకు అభిషేకాలు ఎందుకు చేస్తారు అంటే… గుడిలో దేవుని విగ్రహాలు చాలా దృఢంగా ఉంటాయి. కానీ అంతే పెళుసుగా కూడా ఉంటాయి. అంటే చాలా సులుగువా ఇరిగిపోయేలా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఆ విగ్రహాలను నిరంతరం మెరిసేలా, అలాగే మృధువుగా ఉంచాలి. అప్పుడే విరక్కుండా ఉంటాయి. అలా మృధువుగా ఉండాలంటే పాలు, పెరుగు, తేనె వంటి పదార్ధాలతో అభిషేకం చెయ్యాలి.

వీటిలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక విగ్రహాన్ని అంతే పటిష్టంగా, మృధువుగా, ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే విగ్రహాలకు అభిషేకం చేస్తుంటారు. అంతే కాకుండా పాలు,పెరుగు, తేనె కలిపిన పంచామృతాన్నే భక్తులకు తీర్థంగా పోస్తుంటారు అందుకే ఈ పదార్థాలను ఉపయోగిస్తారు. ఇక రెండోది ఏంటంటే పంచాగల్లో దేవుళ్ళను కూడా ఎంతో శ్రద్ధగా, ప్రేమగా, మనల్ని మనం చూసుకున్నట్టే చూసుకోవాలి అని రాసుంటుంది.

అందుకే ఎప్పుడైనా సరే మన గురించి మనం ఎలా అయితే జాగ్రత్తలు తీసుకుంటామో, ఎలా అయితే మనల్ని మనం శుభ్రంగా ఉంచుకుంటామో దేవుని విగ్రహాలను కూడా అలానే చూసుకోవాలి. దీని బట్టి అర్థం అయ్యింది ఏంటి అంటే… మన సాంప్రదాయాలు అన్నీ కేవలం పేరుకి మాత్రమే కాదు, ఎన్నో అతరార్థాలతో కూడి ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీటి వెనక ఉన్న అసలైన అర్థాలను మనకు స్కూళ్ళలో, కాజీల్లో నేర్పలేదు కాబట్టి వీటి గురించి తెలుసుకోలేక పోయాము. అందుకే ప్రతీ చిన్న సాంప్రదాయం వెనక ఒక అర్థం ఉంటుందని తెలుసుకుని వాటిని గౌరవించాలి.

watch video :

https://www.instagram.com/reel/CrqFjKgsRZm/?utm_source=ig_web_copy_link

ALSO READ : తిరుపతి లడ్డు కోసం వాడే ఈ “నందిని నెయ్యి” ప్రత్యేకత ఏంటి..? ఇప్పుడు ఎందుకు ఆపేశారు..?


End of Article

You may also like