Ads
భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కల్యంపూడి రాధాకృష్ణ రావు 102 ఏళ్ల వయసులో యూఎస్ లో కన్నుమూశారు. ఆయనకు ఈ ఏడాది స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం ఆ రంగంలో నోబెల్ బహుమతితో సమానం.
Video Advertisement
75 సంవత్సరాల పాటు స్టాటిస్టిక్స్‌లో రాధాకృష్ణ రావు చేసిన సేవలకు గాను ఈ పురస్కారం వరించింది. కెనడాలో మే 1న సీఆర్ రావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
కల్యంపూడి రాధాకృష్ణ రావు బళ్లారిలోని తెలుగు కుటుంబంలో జన్మించిన పదిమంది సంతానంలో ఎనిమిదవ వాడు. రావు తండ్రి పోలీసు ఇనస్పెక్టరు. ఆయన నూజివీడు, నందిగామలో చదివారు. ఆ తరువాత వైజాగ్ లో స్కూల్ ఫైనల్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన ప్రతి క్లాస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆంధ్రా యూనివర్శిటీ నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్సి పట్టా పొందాడు. అక్కడి నుండి కలకత్తా వెళ్ళిన రావు 1943లో కలకత్తా యూనివర్సిటీ నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తొలిసారి పొందిన అతికొద్ది మందిలో రావు ఒకరిగా నిలిచారు. ఆయన యూనివర్శిటీ మొదటి ర్యాంకు సాధించారు. అదే సంస్థలో లెక్చరర్ గా చేరారు. అలాగే ఉద్యోగిగా పరిశోధనలు మొదలుపెట్టారు. వాటిలో భాగంగానే ఆయనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు కొనసాగించే ఛాన్స్ ను పొందారు. ఆయన రీసెర్చ్ చేసిన అంశాలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వారు రావు రచనను రిలీజ్ చేశారు. అప్పటికి రావు వయస్సు 26 ఏళ్లు మాత్రమే.
965లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీ నుండి పిహెచ్ డి పట్టా పొందాడు. రావు కేంబ్రిడ్జ్‌లోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ మరియు ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలో పనిచేశాడు. ఆ తరువాత రావు ఇండియాకి తిరిగి వచ్చి స్టాటిస్టిక్స్ శాఖను స్థాపించారు. ఆ తరువాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా, మరియు ఎన్నో ముఖ్యమైన పదవులను చేపట్టిన రావు, ఎన్నో సత్కారాలు అందుకున్నాడు.
1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ బిరుదు అందుకున్నారు. 2002లో ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ చేతుల మీదుగా ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ ను అందుకున్నాడు. 2017లో స్టాటిస్టిక్స్‌లో అంతర్జాతీయ బహుమతిని అందుకున్నాడు. రావు బ్లాక్‌వెల్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. జన్యుశాస్త్రం, జీవావరణ శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలతో సహా అనేక అనువర్తిత సమస్యల పై పనిచేశాడు. భారతదేశంలో నమూనా సర్వే పద్ధతుల అభివృద్ధిలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు.
End of Article