Ads
ఉభయగోదావరి జిల్లా వాసులకు కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ గురించి చెప్పనవసరం లేదు. గోదారి జిల్లాలోని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా సరే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం చేసే ఉంటారు. సుబ్బయ్య గారి హోటల్ లో బుట్ట భోజనం అంటే పడి చస్తారనుకోండి. సుబ్బయ్య గారి హోటల్ అనేది ఒక బ్రాండ్. ఆ హోటల్ లో భోజనం చేసిన ఎవరైనా సరే జీవితంలో అది మర్చిపోలేరు
Video Advertisement
అసలు ఈ సుబ్బయ్య గారి హోటల్ ఎలా ప్రారంభమైందంటే 1950 సంవత్సరంలో కాకినాడలో పదిమంది స్టాఫ్ తో సుబ్బయ్య ఈ హోటల్ ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు అక్కడ రూముల్లో ఉండి చదువుకునేవారు. వారికి భోజనం సదుపాయం కలిగించాలని ఉద్దేశంతో సుబ్బయ్య గారు ఈ హోటల్ ని ప్రారంభించారు.
దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందింది. అలా ఆనాటి నుండి నేటి వరకు సుబ్బయ్య గారి హోటల్ తెలుగు లేకుండా మేటి హోటల్ గా నిలిచింది.సుబ్బయ్య గారి హోటల్ లో భోజనం అంటే సుమారు 35 రకాల వంటకాలతో వడ్డిస్తూ ఉంటారు. హోటల్ లో సిబ్బంది కొసరి కొసరి వడ్డిస్తూ గోదావరి మర్యాదలతో పొట్ట నింపుతారు. బుట్ట భోజనం కోసం ఇక్కడ జనం ఎగబడుతుంటారు.
ఇన్నాళ్లు కాకినాడ వాసులకి పరిమితమైన సుబ్బయ్య గారి హోటల్ ని నేడు తెలంగాణ రాష్ట్రంలో కె.పి హెచ్.బి కాలనీలో ప్రారంభించారు తర్వాత హైదరాబాదులో వివిధ బ్రాంచ్ లు కూడా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా సుబ్బయ్య గారి హోటల్ ని ప్రారంభించారు. తమ గోదావరి జిల్లాల హోటల్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అవడం పట్ల గోదావరి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:కార్తీక మాసంలో ఈ పనులు అస్సలు చేయకండి..! అవి ఏంటంటే..?
End of Article