Ads
హిందువుల పవిత్ర గ్రంథాలలో రామాయణం ఒకటి. రామాయణ ఇతిహాసం గురించి. అందులోని కథల గురించి చిన్నతనం నుంచి వింటూ, సీరియల్స్, సినిమాల రూపంలో కూడా చూస్తూ వస్తున్నాము. అలా శ్రీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమాన్, రావణుడు వంటి చాలా పాత్రల గురించి అందరికీ తెలిసి ఉంటుంది.
Video Advertisement
అయితే రామాయణంలో శాంతా దేవి గురించి కూడా ఉంది. కానీ ఈ విషయం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ఈ శాంతా దేవీ ఎవరు? ఆమె శ్రీ రాముడికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
శాంతా దేవీ ఎవరో కాదు. శ్రీరాముడి అక్క. ఈ విషయం చాలా మందికి తెలియదు. దశరథ మహారాజు, కౌసల్యల కుమార్తె శాంత దేవి. శాంతా దేవీకి ప్రత్యేకమైన జ్ఞానం కల అందమైన స్త్రీ. పురాణాల ప్రకారం, దశరథ మహారాజు శాంత దేవిని అంగదేశ మహారాజు రోమపాదకు దత్తత ఇచ్చాడు. రోమపాదుడు ఒకసారి దశరథుడిని కలవడానికి, భార్యతో పాటు అయోధ్యకు వచ్చాడు. అక్కడ దశరథుడి కుమార్తెను చూసిన రోమపాదుడు తమకు పిల్లలు లేరని బాధపడుతుండడం చూసిన దశరథుడు తన ఒక్కగానొక్క కుమార్తె శాంతను వారికి దత్తత ఇస్తాడు.
అలా అంగ దేశానికి శాంతా దేవీ యువరాణి అవుతుంది. ఒకసారి రోమపాదుడు తన కుమార్తె శాంతా దేవీతో మాట్లాడుతున్న సమయంలో ఓ బ్రాహ్మణ యువకుడు రాజు దగ్గరికి వర్షాకాల పంటను పండించడానికి సాయం అడగడానికి వచ్చాడు. అయితే రాజు ఆ యువకుడి విన్నపాలను పట్టించుకోడు. రాజు శ్యామ్ కోసం ఎదురుచూసిన ఆ యువకుడు అక్కడి నుండి వెళ్లిపోతాడు. తన భక్తుడిని రాజు పట్టించుకొకపోవడంతో వర్ష దేవత ఇంద్రాదేవి ఆగ్రహిస్తుంది. దాంతో రాజ్యంలో వర్షాలు కురవకపోవడంతో ప్రజలంతా ఇబ్బంది పడతారు.
అప్పుడు రోమపాద మహారాజు ఋషిశృంగుని దగ్గరకు వెళ్లి యజ్ఞం చేయమని అడుగుతాడు. యజ్ఞం చేయడంతో వర్షాలు పడి, దేశంలో కరువు తగ్గుతుంది. అందుకు సంతోషించిన రోమపాదుడు శాంతా దేవీను ఋషిశృంగునికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు. దశరథుడు సంతానం కోసం తలపెట్టిన పుత్రకామేష్ఠి యజ్ఞంను ఋషిశృంగుడు జరిపిస్తాడు. ఆ యజ్ఞం వల్ల రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో కులులో శాంతా దేవీ, ఋష్యశృంగుని ఆలయం ఉంది. దేశం నాలుగు మూలల నుంచి భక్తులు వచ్చి శ్రీరాముడి అక్క శాంతాదేవిని పూజిస్తారు. విజయదశమి సందర్భంగా ఈ గుడిలో ప్రత్యేక పూజలను చేస్తారు.
Also Read: అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం రూపొందించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?
End of Article