అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం రూపొందించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం రూపొందించిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

అయోధ్య రామమందిరంలోని గర్భగుడి దగ్గరికి రామ్ లల్లా చేరుకున్న విషయం తెలిసిందే. అయోధ్య ప్రారంభోత్సవ  సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం రామ మందిర గుర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకువచ్చారు.

Video Advertisement

‘జై శ్రీరాం’ నినాదాల మధ్య క్రేన్ సాయంతో విగ్రహాన్ని గర్భగుడి ప్రాంగణంలోకి తీసుకుని వచ్చారు.  అంతకు ముందు మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అయితే రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఎవరో ఉప్పుడు చూద్దాం..
జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమయం కోసం యావత్ దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. సుమారు 150 -200 కిలోల బరువున్న రాముడి విగ్రహాన్ని తాజాగా ఊరేగింపుతో రామ మందిరానికి తీసుకువచ్చారు. ఈ విగ్రహాన్ని మైసూర్ కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. ఈ భాగ్యం తమకు దక్కినందుకు యోగిరాజ్ కుటుంబం సంతోష పడుతున్నారు.
ఈ క్రమంలో అరుణ్ యోగిరాజ్ భార్య విజేత తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె భర్త విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు అతని కంటికి గాయం అయిన విషయాన్ని వెల్లడించింది. రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కే పనిని అరుణ్ యోగిరాజ్‌కి అప్పగించినప్పుడు, విగ్రహానికి అనువైన రాయి మైసూరు సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అయితే అతను రాయి కోసం సైట్ ను సందర్శించినప్పుడు ఆ రాయి చాలా గట్టిగా ఉంది. విగ్రహాన్ని చెక్కుతున్న క్రమంలో ఒక పెచ్చు యోగిరాజ్ కంటికి గుచ్చుకుంది. దానిని తొలగించడానికి కంటి ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది.
విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ, దానిని భరిస్తూనే విగ్రహం చెక్కడాన్ని కొనసాగించాడని చెప్పుకొచ్చారు. చివరికి  ఆయన కృషి, అంకితభావం, పనితనం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పుణ్యకార్యానని అప్పగించినందుకు తమ కుటుంబం ఆనందంలో మునిగిపోయిందని వెల్లడించింది.

https://www.instagram.com/p/Csc7ZbXqvTN/

Also Read: అయోధ్యకు చేరుకున్న రాముని అఖండ జ్యోతి.. దీని ప్రత్యేకతలు తెలిస్తే ఒళ్ళు పులకరిస్తుంది!


End of Article

You may also like