Ads
అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఇవాళ ఘనంగా జరగనుంది. దీని కోసం ఎంతో భారీగా ఏర్పాటు కూడా చేశారు. ఈ వేడుకకి ఎంతో మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు అవుతున్నారు.
Video Advertisement
తెలుగు నుండి చిరంజీవికి, రామ్ చరణ్ కి, ప్రభాస్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానాలు అందాయి. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా వేడుకకి వెళ్తున్నారు. సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉండడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకి వెళ్లలేకపోతున్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనే వ్యక్తి ఎంతో భక్తి శ్రద్ధలతో రూపొందించారు.
గత శుక్రవారం నాడు శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యకి తరలించారు. అయితే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు కూడా ఉండేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఆ వివరణ కూడా ఎంతో చక్కగా రూపొందించారు అని విగ్రహం చూస్తుంటే తెలుస్తోంది. శ్రీరాముడి విగ్రహం మీద రూపొందించిన 10 అవతారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కూర్మావతారం
కూర్మావతారం, అంటే తాబేలు లాగానే అసురులకి, దేవుళ్ళకి మధ్య యుద్ధం జరిగినప్పుడు, మహావిష్ణువు క్షీరసాగర మధనం సమయంలో మందర పర్వత బరువుని మోసారు.
వరాహవతారం
వరాహవతారంలో శ్రీ విష్ణువు భూమిని రక్షించడం కోసం హిరణ్యకశ్యపుడితో యుద్ధం చేశారు. భూమిని మునిగిపోకుండా తన దంతాలతో రక్షించారు. అందుకే వరాహవతారం భూమికి దగ్గరగా ఉంటుంది.
నరసింహావతారం
హిరణ్యకశిపుడు నుండి భక్త ప్రహ్లాదుడిని కాపాడటానికి విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తారు. భూమిపై ఎన్ని రకాల జీవరాసులు ఉంటాయో అనే విషయాన్ని నరసింహావతారం ద్వారా విష్ణుమూర్తి తెలియజేశారు.
వామనావతారం
బాలి అనే రాజు నుండి పృథ్వీ, దేవ, పాతాళ లోకాలని కాపాడటానికి శ్రీ విష్ణు వామనావతారంలో దర్శనం ఇచ్చారు. యజ్ఞం సమయంలో వామనావతారంలో వెళ్ళిన శ్రీ విష్ణువు, బాలి రాజుని తన పాదం ఉన్న స్థలాన్ని తనకి ఇవ్వమని అడిగారు. అందుకు బాలి రాజు అంగీకరిస్తారు. కానీ తర్వాత వామనావతారంలో వచ్చింది మరెవరో కాదు శ్రీ విష్ణువు అని అర్థం చేసుకుంటారు.
పరశురామ అవతారం
బ్రాహ్మణుడి, క్షత్రియుడి విధులు ఏంటో వివరించడానికి శ్రీ విష్ణువు పరశురామ అవతారంలో దర్శనం ఇచ్చారు. పరమశివుడి మహా భక్తుడు అయిన పరశురాముడికి ఒక గొడ్డలి వరంగా లభిస్తుంది. మనుషులు మొదట్లో అడవుల్లో బతికేవారు. వారి మొదటి ఆయుధం కూడా గొడ్డలి. ఇదే విషయాన్ని, అంటే మానవ జీవితం ఎలా మొదలయ్యింది అనే విషయాన్ని పరశురామ అవతారం ద్వారా తెలియజేశారు.
రామావతారం
రావణుడిని సంహరించడానికి త్రేతా యుగంలో శ్రీ విష్ణువు రామావతారంలో జన్మించారు. తనకంటే తన విధులు ఎంత ముఖ్యమో, ఒక వ్యక్తి తన విధులు ఎలా నిర్వహించాలో చెప్పడానికి శ్రీ విష్ణువు ఈ అవతారం ఎత్తారు.
బుద్దావతారం
ప్రపంచం సత్యంతో నడవడం అనేది ఎంత ముఖ్యం అనే విషయాన్ని తెలియజేయడానికి శ్రీ విష్ణువు బుద్ధుడి అవతారాన్ని ఎత్తారు.
కృష్ణావతారం
కంసుడిని సంహరించడానికి, మానవులు సమాజంతో పాటు ఎలా మెరుగుపడాలి అనే విషయాన్ని తెలియజేయడానికి శ్రీ విష్ణువు కృష్ణావతారం ఎత్తారు. అర్జునుడికి కురుక్షేత్ర సమయంలో గీతోపదేశం చేసి, శ్రీకృష్ణుడు వాస్తవికత అనే అంశం గురించి తెలియజేశారు. జీవితం అనే ప్రయాణం గురించి, అందులో మానవమేధస్సు ఎలా ఉండాలి అనే విషయం గురించి చాటి చెప్పడానికే కృష్ణావతారంగా దర్శనం ఇచ్చారు.
కల్కి అవతారం
కల్కి అనేది శ్రీ విష్ణువు యొక్క పదవ అవతారం. మానవులలో చీకటి కోణం బయటికి వచ్చినప్పుడు, ప్రపంచాన్ని అలాంటి వ్యక్తుల బారి నుండి కాపాడడానికి శ్రీ విష్ణువు కల్కి అవతారం ఎత్తారు. అధర్మాన్ని తొలగించి, మరొక కొత్త యుగానికి నాంది పలకడానికి శ్రీ విష్ణువు కల్కి అవతారంలో దర్శనం ఇచ్చారు.
ఈ విధంగా, శ్రీరాముడి ప్రతిమ మీద శ్రీ విష్ణువు పది అవతారాలు కూడా ఉండేలాగా అయోధ్యలోని రామ మందిరంలోని రాముడి విగ్రహాన్ని రూపొందించారు.
ALSO READ : HANUMAN FOR SRIRAM: టికెట్ కి 5 రూపాయల చొప్పున…”హనుమాన్ టీం” అయోధ్యకి మొత్తం ఎంత డొనేట్ చేసారో తెలుసా.?
End of Article