Ads
జీవితం అన్నాక ఒడిదుడుకులు సహజం. వాటన్నిటినీ తట్టుకొని ఎదురు వెళ్లి నిలబడే వాళ్ళకి విజయం లభిస్తుంది. అలా ఒక మహిళ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఆమె పేరు అంకితి బోస్.
Video Advertisement
అంకితి బోస్ ఈ కామర్స్ స్టార్టప్ అయిన జిలింగో సహ వ్యవస్థాపకురాలు. 2015 లో ధ్రువ్ కపూర్ తో కలిసి ఈ కంపెనీ నెలకొల్పారు. అంకితి బోస్ డెహ్రాడూన్ లో పుట్టారు. ముంబైలోని కేంబ్రిడ్జ్ స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత సెయింట్ జేవియర్స్ కాలేజ్ లో గణితం, ఆర్థిక శాస్త్రాన్ని చదివారు.
మెకిన్సే అండ్ కంపెనీ, సీక్వోయా క్యాపిటల్‌లో ఉద్యోగిగా తన కెరీర్ ప్రారంభించాక ఎంతో కష్టపడి అక్కడ ఎదిగారు. అయితే ఒక సమయం తర్వాత ఆగ్నేయాసియాలోని ఫ్యాషన్ మార్కెట్ రిటైలర్‌లు తమ వ్యాపారాలని సరిగ్గా ఆన్ లైన్ లో విస్తరించలేకపోతున్నారు అని ఒక పర్యటనలో ఉన్నప్పుడు అంకితి బోస్ గమనించారు. అప్పుడు ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు.
ఎంతో జీతం వస్తున్న తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి సింగపూర్ కి వెళ్ళిపోయారు. అక్కడ అంకితి బోస్ జిలింగో స్థాపించారు. అంకితి బోస్ ఇండోనేషియాలో ఉండే మహిళల కోసం దుస్తులు తయారు చేయడానికి డిజైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది నాయకులను తయారు చేయడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ఎన్నో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. 2019 లో వారి కంపెనీ దాదాపు 970 మిలియన్ డాలర్ల విలువ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 7957 కోట్ల రూపాయలు. అయితే అంకితి బోస్ తాను స్థాపించిన కంపెనీ నుండి బయటికి వచ్చేయాల్సి వచ్చింది.
అందుకు కారణం అనుమతి లేకుండా అంకితి బోస్ తన జీతాన్ని 10 రెట్లు పెంచేశారు. అంతే కాకుండా కొంత మంది వ్యాపారులకి వివరణ లేకుండా ఎన్నో ఆర్థిక లావాదేవీలు కూడా చేసినట్టు కంపెనీ ఖర్చుల్లో చూపించింది. ఈ కారణంగా ఆమె కంపెనీ తనని సస్పెండ్ చేసింది. తనపై వచ్చిన ఈ ఆరోపణలను కరెక్ట్ అని చూపించడంలో జిలింగో బోర్డు విఫలం అయింది అని అంకితి బోస్ ఒక సందర్భంలో పేర్కొన్నారు. ఈ విషయం మీద వివిధ వాదనలు వినిపించాయి. మరి వినిపించిన వాదనలో ఎక్కడ ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు.
End of Article