Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతోంది. భారతదేశం అంతా కూడా జాంనగర్ వైపే చూస్తోంది. భారతదేశంలోనే. కాదు కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి ముందు జరిగే వేడుకలు గుజరాత్ లోని జాంనగర్ లో అంగరంగ వైభవంగా చేస్తున్నారు.
Video Advertisement
అంబానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటేనే బాలీవుడ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి అంటే బాలీవుడ్ ఏంటి. హాలీవుడ్ వాళ్లు కూడా ఉన్నారు. సినిమా వాళ్లు, రాజకీయాలకు చెందిన వాళ్లు, వ్యాపారవేత్తలు, క్రీడారంగానికి చెందినవారు, ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు కూడా ఈ వేడుకకి హాజరు అవుతున్నారు.
అంబానీ వారి మర్యాదల్లో కూడా ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్స్ బయట ఎక్కువ సేపు అంబానీ కుటుంబం కోసం వేచి చూసి, అక్కడికి వస్తున్న ప్రముఖుల గురించి సంబంధించిన విషయాలు అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. వారు కూడా అలసిపోవద్దు అని ఉద్దేశంతో, వారి కోసం ఒక స్పెషల్ మీల్, తాగడానికి పానీయాలు, పండ్లు, స్వీట్లు వంటివి పంపించారు. ఇంక వేడుకల్లో అయితే దాదాపు 2000 రకాల వంటలు ఉన్నాయి అని సమాచారం. అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఖర్చు కూడా మామూలుగా ఉండదు కదా. కొన్నాళ్ల క్రితం అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి జరిగింది.
ఆమె పెళ్లి కోసం 700 కోట్లు ఖర్చు పెట్టారు. పెళ్లిలో ఇషా అంబానీ 90 కోట్ల విలువైన లెహంగాని ధరించారు. వాలంటీనో అనే అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ ఇషా అంబానీ కోసం మొదటి సారి ప్రత్యేకంగా ఇండియన్ డిజైనర్ లెహంగాని తయారు చేశారు. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం కూడా 1000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని సమాచారం. ప్రముఖ ఇంటర్నేషనల్ సింగర్ రిహానా వచ్చి ఇప్పటికే అంబానీ వేడుకలో పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
ఇంకా ఎంతో మంది అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అవుతారు. జూలైలో పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు జరిగేది పెళ్లికి ముందు జరిగే సెలబ్రేషన్స్. ఇవన్నీ కలిపి 1000 కోట్లు అవుతుంది. నిన్న జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీలో అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ వారు తయారు చేసిన దుస్తులను మాత్రమే అంబానీ కుటుంబం ధరించారు. వాటి ధర కోట్లల్లోనే ఉంటుంది. అంతే కాకుండా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ప్యార్ హువా పాటకి డాన్స్ కూడా వేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఇంకా ఇలాంటి హైలైట్స్ వీరి వేడుకలో చాలా జరుగుతాయి.
watch video :
Ambanis can act and dance too 🤌🏻✨#RadhikaMerchant #Jamnagar pic.twitter.com/RwkTb1N90i
— CHIRAG TALWAR (@Chiragtalwar23) March 1, 2024
ALSO READ : ఇలా కుడా అవుట్ అవుతారా.? పాపం తమన్ అన్న..!
End of Article