Ads
జనాతా కర్ఫ్యూ – దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో దానికి అరికట్టడానికి మోడీ ఇచ్చిన పిలుపు . మార్చి 22 న దేశమంతా స్వయంగా తమకు తామే కర్ఫ్యూ విధించుకోవాలని, ఉదయం ఏడుగంటలనుండి రాత్రి తొమ్మిది లోపు వరకు ఎవరూ బయటికి రావొద్దనేది ఈ జనతా కర్ఫ్యూ ఉద్దేశం. దీనిని పాల్గొనవలసిందిగా కాకపోతే ఉదయం ఆదివారం ఉదయం ఏడు నుండి సోమవారం ఉదయం ఏడుగంటల వరకు తెలంగాణా రాష్ట్రం మొత్తం జనతా కర్ఫ్యూ ఫాలో అవ్వాలని రాష్ట్ర మంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. అసలు ఈ కర్ఫ్యూ ఉద్దేశం ఏంటి,దీని వల్ల జరిగే ఫలితం ఏంటి తదితర వివరాలు.
Video Advertisement
ముందు నుండి చెప్తున్నట్టుగానే కరోనా వైరస్ ని అరికట్టాలంటే వ్యాప్తి చెందించకుండా ఉండడమే మార్గం. అందులో భాగంగానే ఈ జనతా కర్ఫ్యూ. ఇప్పటివరకు కరోనాకి మందు కనుగొనబడలేదు. వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ దేశాలన్ని ప్రయత్నిస్తున్నాయి. కనిపెట్టడానికి మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, అరవైఏళ్ల పై బడిన వారే వైరస్ బారిన పడుతున్నారు. మరణాల శాతం కూడా వారిలోనే అధికం. అందువలన వీరిని ఎట్టి పరిస్థితిలో ఇంటి నుండి బయటికి రానివ్వొద్దని ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాదు యావత్ దేశం అంతా ఒక రోజు పాటు ఎవరికి వారే క్వారంటైన్ ఏర్పరచుకుంటే వైరస్ వ్యాప్తిని అదుపు చేయొచ్చన్నది జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం.
కరోనా వైరస్ జీవితకాలం ఎంతనేది సరైన సమాచారం లేదు. ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్తున్నరు. గంటల నుండి రోజుల వరకు ఉంది . కాబట్టి సుమారు పన్నెండు గంటలుగా కొందరి అంచనా. కాని ఎవరికి వారే క్వారంటైన్ విధించుకుని ఇంటి నుండి బయటికి రావడం మానేస్తే ఒకరి నుండి ఒకరికి అంటుకునే వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగిన వాళ్లమవుతాం. మరోవైపు ఆ రోజు విదేశాల నుండి వచ్చిన వారిని పరీక్షించి ఐసోలేషన్ కి పంపాలనేది మరో ప్లాన్.జనతా కర్ఫ్యూ వలన వైరస్ వ్యాప్తి చెందే చెయిన్ ని కొంతవరకైనా బ్రేక్ చేయొచ్చు.
అత్యవసర పనులు ఉన్నవాళ్లు ఉదయం ఏడు గంటలకి ముందు, రాత్రి తొమ్మిది తర్వాత చూసుకోవడం ఉత్తమం. తెలంగాణాలో ఇరవై నాలుగు గంటలపాటు కర్ఫ్యూ , కాబట్టి ఆ రోజంతా బయటికి రాకుండా ఉంటే మంచిది. ఆ రోజు చేసుకోవాలసిన పనులు ఏమైనా ఉన్నా ముందు రోజు చూస్కోవడం ,లేదా తర్వాత రోజుకి పోస్ట్ పోన్ చేస్కుంటే మరీ మంచిది.జనం కూడా ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వరు కాబట్టి ఆ రోజు ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాపించదు.
ఒకరోజు బయటికి రాకుండా ఉంటే వైరస్ తర్వాత ఇక ఉండదా అనే వాదనలు వినిపిస్తున్నాయి, కాని ఆ ఒక్కరోజు చేయడం కూడా మామూలు విషయం కాదు. ఒక రకంగా మనం యుద్దం చేస్తున్నట్టే. ఆ యుద్దంలో నువ్వూ నేను, చిన్నా పెద్ద, ముసలి ముతకా, పేదా ధనిక, కులం మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటేనే ఈ యుద్దంలో విజయం సాధ్యం అవుతుంది. చైనాలోని వూహాన్ నగరం ఒకటి రెండు రోజులు కాదు నెలల పాటు తనని తాను నిర్భందించుకుంది.
ప్రపంచ దేశాలన్ని దారులు మూసేసుకున్నాయి. ఇటలీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రస్తుతం మన దేశంలో వైరస్ సెకండ్ స్టేజ్లోనే ఉంది అంటే విదేశాల నుండి వచ్చిన వారిలోనే ఉంది, కాబట్టి థర్డ్ స్టేజ్ లోకి అనగా ఇక్కడ ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా చూడడంలో ఈ కర్ఫ్యూ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ పిలుపులో అందరం భాగస్వాములవుదాం. కరోనా పై యుద్దం చేద్దాం, విజయం సాధిద్దాం. ఆల్ ది బెస్ట్.
End of Article