కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుంది అంటే.? 8 నెలల క్రితమే కరోనా వచ్చే డేట్ కరెక్ట్ గా చెప్పారు.!

కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుంది అంటే.? 8 నెలల క్రితమే కరోనా వచ్చే డేట్ కరెక్ట్ గా చెప్పారు.!

by Anudeep

Ads

కరోనా పేరు వినగానే ఏ దుర్వార్త వినబడుతోందనని భయభ్రాంతులకు గురవుతున్నారా?? రిలాక్స్ … ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కొంత ధైర్యాన్నిస్తుంది. ఇంకెన్ని రోజులో..ఇంకెన్ని నెలలో ఈ లాక్ డౌన్లు..ఇంకెన్ని రోజులు ఇలా బిక్కు బిక్కు మంటు గడపడం అనుకునే వాళ్లకి  ఈ చిన్నోడి మాటలు ఊరటనిస్తాయి. ఇండియాలో 20కోట్ల మంది కరోనా బలిపీఠం ఎక్కనున్నారని హడలెత్తించిన వార్తలు , వాట్సప్ ఫార్వార్డ్లతో పోలిస్తే మనోడు చెప్తున్న గ్రహ సంచార లెక్కలు భవిష్యత్ పై కొంత భరోసాను నింపుతున్నాయి.

Video Advertisement

మేధావి, ఏకసంతాగ్రహి అనే పదాలు వినే ఉంటారు కదా అభిజ్ణా ఆనంద్ కి  అచ్చంగా సూటయ్యే పదాలు. వయసు పద్నాలుగేళ్లు, ఊరు మైసూర్ . వాస్తవానికి ఆ వయసుకి ఇలాంటి విషయాలు ఏం తెలుస్తాయి అనుకోకండి. ముందే  చెప్పాంకదా బాలమేధావి అని. ఇప్పటికే వేదాలు చదివేసాడు . బహుభాషా ప్రావిజ్ణుడు , గ్రహ స్థితులని బట్టి భవిష్యత్లో జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తుంటాడు. చాలామంది అదెలా సాధ్యం అని కొట్టిపారేస్తుంటారు.మన దగ్గర జోతిష్యం అనేది ఒకటుంది, దాన్ని నమ్మేవాళ్లు  చాాలామందే ఉన్నారు. జోతిష్యం చెప్పేది గ్రహస్థితులని బట్టే కదా. మనోడు చెప్పింది కూడా ఆ లెక్కప్రకారమే.

ప్రతి ఏడాది పంచాంగ శ్రవణం అప్పుడు మన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రాశుల ప్రకారం చెప్తుంటారు. అదేంటో కరోనా ఇంత విలయతాండవం చేస్తుందని ఒక్క పండితుడు చెప్పలేదు. కాని మనోడు గతేడాదే కరోనా గురించి చెప్పిన విషయాన్ని యూట్యూబ్లో పెట్టాడు.   ఇప్పుడు ఆ వీడియో వైరలవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం చెప్పాడంటే 2020లో ఒక బయోలాజికల్ వార్ జరుగుతోంది, అందులో ముఖ్యంగా చైనా సఫర్ అవుతుంది.రవాణా ఆగిపోయి, జనాలు ఎక్కడివాళ్లక్కడ ఇళ్లల్లో స్తంబించిపోతారు అని చెప్పాడు.అప్పుడు చెప్పిన దాన్ని అందరూ మర్చిపోయుంటారు.

అందుకే లేటెస్ట్ గా ఆ వీడియోని టాగ్ చేస్తూ మరో వీడియో చేశాడు . నేను అప్పుడే చెప్పాను కదా, వైరస్ అని చెప్పలేదు కాని మిగతా అంతా నేను చెప్పినట్టే జరుగుతోంది అంటూ మరో వీడియో అప్లోడ్ చేశాడు.అంతేకాదు . మార్చి 29 నుండి ఏప్రిల్ 2 వరకు చాలా ముఖ్యం అని ఈ ఐదు రోజులపాటు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని చెప్పుకొచ్చాడు. గ్రహస్థితులని బట్టి ఏప్రిల్ రెండు తర్వాత ఈ పీడ విరగడ అవుతుందని అంటున్నాడు. అయితే దేశంలో అత్యంత కీలకమైన ఇంక్యుబేషన్ పీరియడ్ ముగిసే టైం కూడా సరిగ్గా ఇదే.

నిజమే ఈ సైన్సు యుగంలో ఇలాంటి మాటలు కూడా  నమ్ముతారా అంటే ? నమ్మకం అనేది ఎవరిష్టం వారిది. కొందరు దేవున్ని నమ్మేవారుంటారు, మరికొందరు నమ్మరు . అదే విధంగా ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పారనే వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. కాని పరిష్కారం లేని వార్తలు ఎన్నొచ్చి ఏం లాభం. మనిషి భయాన్ని పోగొట్టేలా చెప్పే మాటలు నిజం అవ్వడం అవ్వకపోవడం అనేది తర్వాత విషయం, కానీ బతకడానికి కొంత ధైర్యాన్నైనా ఇస్తాయి అనేది నిజం. అభిజ్ణ మాటలు కూడా ఇప్పుడు జనాలకి స్వాంతన కలిగిస్తున్నాయి.

watch video:


End of Article

You may also like