“మదర్స్ డే స్పెషల్” ఒక అమ్మ జ్ణాపకం..ఎందరో అమ్మల అనుభవం..చదివితే కన్నీళ్లొస్తాయి..

“మదర్స్ డే స్పెషల్” ఒక అమ్మ జ్ణాపకం..ఎందరో అమ్మల అనుభవం..చదివితే కన్నీళ్లొస్తాయి..

by Anudeep

Ads

మేం కూడా అమ్మలమయ్యామే కానీ ప్రెగ్నేన్సీ ని ఇలా ఎంజాయ్ చేయలేదు అని ఒకరు ….అబ్బో ఆమె ఇప్పుడు అమ్మ అయింది బాబూ.. పిల్లలే లోకం మనమెక్కడ గుర్తుంటాం.. అని నా ఫ్రెండ్ నాతో అన్నమాటలు ఇప్పటికి గుర్తొస్తాయి…అవును బిడ్డ కడుపులో పడిన క్షణం నుండి వాడిని నా చేతిలోకి చేరిన క్షణం వరకు ఎంతో అపురూపం.నా గుండెలో ఆ జ్ఞాపకాలు ఒకవేళ నేను చనిపోయినా పోవేమో… అంత భద్రం….రోజు రోజుకి బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అని ఇంటర్నెట్ లో తెలుసుకోవడం….ఆంటీ, ఈరోజు లోపల నా చింతల్లికి కాళ్ళు, చేతులు పెరిగాయి… ఈ రోజూ టోటల్ బాడీ పార్ట్స్… ఈ వారంలో హెయిర్ పెరుగుతుంది …ఈ రోజు బయట సౌండ్స్ వింటాడట… నిజమే ఆ రోజే మేం సినిమా కి వెళ్లడం…లోపల వాడు గిర గిరా తిరగడం …ఒహ్హొ..

Video Advertisement

Mother's Day 2020 Images in Telugu

Mother’s Day 2020 Images in Telugu

రోజూ ఉదయం లేవగానే గుడ్ మార్నింగు నైట్ పడుకునేముందు గుడ్ నైట్ చెప్తే ఒక తన్ను తన్నేవాడూ అదే వాడి రిప్లై …>ఒకరోజు మార్నింగ్ నుండి లోపల కదలికలేదు…నాకు టెన్షన్ ..భయంతోనే ఆఫీస్ కి బయల్దేరా… మధ్యలో ఎన్నిసార్లు పిలిచుంటానో చింతల్లి అని..అయినా కదలిక లేదు… లోపల మూవ్ మెంట్ బాగుంటే బేబీ హెల్థీగా ఉన్నట్టు అనే మాటలు పదే పదే గుర్తొస్తున్నాయ్… ఆఫీస్ కి.వెళ్లా..ఫీల్డ్ కి వెళ్లా.. జనాల్లో ఉన్నా లేనట్టే ఉన్నా… అమ్మకి..మామకి అందరికీ కాల్స్ చేస్తున్నా..ఏం కాదు కాసేపు చూడు అనే మాటె అందరూ….అయిష్టంగానే లంచ్ చేసా… చపాతీ పప్పు తినీ ఆఫీస్ నుండి బైటికి నడుచుకుంటూ వస్తున్నా…. అప్పుడు లోపల ఒకటి కాదు రెండు మూడు సార్లు తంతూనే ఉంది… నా ఆకలి ఎవరు చూస్తారూ…నువ్ తింటేనేగా నా కడుపు నింపేది అనేలా ఉంది లోపల వాడి రియాక్షన్…వామిటింగ్స్ లా ఉందని ముందు రోజు నైట్ నుండి నేను తినలేదు మరీ అందుకే ఇబ్బంది ఫీల్ అయ్యాడేమో…

Mother's Day 2020 Images in Telugu

Mother’s Day 2020 Images in Telugu

ఇవన్నీ బాగుంటాయ్… కానీ ప్రసవవేదన దాని గురించి నిజంగా ఎవరూ చెప్పరూ… మన అమ్మ కూడా మనకి చెప్పదు భయపడ్తామేమో అనో…మరే కారణం చేతో..నొప్పులతో హాస్పిటల్ లోకి ఎంటర్ అయుతుంటేనే మరొకామెని పట్టుకుని ఉన్న ముసలామే డాక్టర్ తో అంటుంది తలకాయ బైటికొచ్చిందమ్మా.. ఇంకెక్కడికి పోవాలీ అని…. ఒకసారిగా తొమ్మిది నెలలపాటు బిపి పెరగకూడదు ఎలాంటి సమస్యలు రావొద్దు అని ఎంత రిలాక్స్ గా ఉన్నానో…. అదంతా పోయింది ఆ ప్లేస్ లోటెన్షన్… భయం… బాధ…పదహారు గంటలు కరెక్ట్‌గా పదహారు గంటలు ప్రసవ వేదన…అయిదు నిమిషాల పాటు ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోతున్నాయా అనేంత నొప్పి మరో నిమిషంలో మత్తుగా నిద్ర… మళ్లీ నిమిషం నిద్రపడ్తుందో లేదో మళ్లీ పెయిన్….మరో వైపు నా చుట్టూ ఉన్నవాళ్లది ఒక్కొక్కరిదీ ఒక్కో కథ…

Mother's Day 2020 Wishes in Telugu

Mother’s Day 2020 Wishes in Telugu

తొమ్మిది నెలలు బిడ్డని మోసిన తల్లి పండంటి బిడ్డ కోసం ఎదురు చూస్తుంది… కానీ లోపల బిడ్డ చనిపోయింది..ఆ సంగతి తెలిసిన వాళ్లమ్మ తన బాధ బిడ్డకి తెలియకుండా నరకం అనుభవిస్తుంది…ఇంకొకామే కవలపిల్లలు ఉన్నారట…ఒకరికి ఇన్ఫెక్షన్ అయింది..ఆ పాప ని తీసెయకుంటే ఇంకొకరికి కష్టం అంటే నెగ్లెక్ట్ చేసింది రెండో పాప కూడా చనిపోయింది… మరొకరిది అయిదునెలలకే పాప చనిపోయింది…. భయం పెరుగుతుంది …నొప్పి పెరుగుతుంది … బాద,భయం,టెన్షన్… పాప పుట్టబోతుందనే సంతోషం….బాధకి సంతోషానికి మధ్యన ఉన్నా ఆ కష్టమైన ఫీలింగ్ ఏంటో నాకిప్పటికీ తెలీదు…

Mother's Day 2020 Wishes in telugu

Mother’s Day 2020 Wishes in Telugu

మీ బిడ్డ నొప్పులు తీస్తలేదు మాకైతే తెలీదు అని అమ్మతో నర్స్ చెప్పిందట…టెన్షన్ ఉన్నా కూడా ఏం కాదు అని డాక్టర్లను దాటుకుంటూ వచ్చి మధ్య మధ్యలో ధైర్యం చెప్పే అమ్మా అత్తమ్మా…బయట తన కళ్లలో ఖచ్చితంగా కన్నీళ్లుంటాయ్… మగాడు ఎన్ని విషయాల్లో కటువుగా ఉన్నా.. అమ్మకి,భార్యకి బాధ కలిగేప్పుడు మాత్రం పసిపిల్లాడే…నొప్పి పెరుగుతుంది ..నా వల్ల కావట్లే…మరోవైపు డాక్టర్లు కసురుకుంటున్నారు…నొప్పులు తీయ్ అనీ…బిడ్డ ఏడవదమ్మా..నొప్పులు తీయకపోతే కష్టం అయితది అంటుంది… నువ్ నొప్పులు తీయకపోతే డెలివరీ చేయము అని డాక్టర్లు వేరే పేషెంటు దగ్గరకి వెళ్లిపోయారు…నా పక్కన నా వాళ్లెవరూ లేరు…

Mother's Day 2020 Images in Telugu

Mother’s Day 2020 Images in Telugu

మరోవైపు శరీరం లో ఎముకలు విరుగుతున్నంత పెయిన్…హెడ్ నర్స్ వచ్చింది నేను డెలివరీ చేస్తా..బిడ్డ ఏడవకపోతే మాకు తెల్వద్ అని అంటుంది…. తొమ్మిది నెలలు కన్న కలలన్నీ మాయమైపోతున్నాయా అన్పిస్తుంది…నొప్పులు తీస్తా… నాతోనే ఉండండి అని హెడ్ నర్స్ చేయ్ పట్టుకున్నా….తలకాయ బయటికొచ్చింది నువ్ నొప్పులు తీయ్ అని హెచ్చరికలా బతిమాలుడుతుంది..ఒక క్షణం ఒకే ఒక క్షణం పాటు నా బిడ్డకావాలి నా బిడ్డ నవ్వులు కావాలి అని నర్స్ చెప్పినట్టు ఊపిరి బిగపట్టి… రెండు చేతులతో బెడ్ గట్టిగా పట్టుకుని నొప్పులు తీసా..వాడు వెయిట్ ఎక్కువుండటం అదో ఇబ్బంది..మూడున్నర కిలోలు…నువ్ అలాగే నొప్పులు తీయ్… తీయమ్మా.. బిడ్డ బయటకి వస్తుంది తీయమ్మా అంటంది…. ప్రాణం పోతున్నంత బాద… ఏడుపు వస్తుంది.

Mother's Day 2020 Images in Telugu

Mother’s Day 2020 Images in Telugu

నాకు ఏం కాదు మా అమ్మ నన్ను కనలేదా..ఎంతమంది పిల్లలు పుట్టలేదు భూమ్మీద అని ధైర్యం చెప్పుకుంటూ నొప్పుల్ని భరిస్తున్నా…. హెడ్ నర్స్ నా కుడి పక్కగా వచ్చి…నువ్ నొప్పులు తీస్తూనే ఉండు అని…. నా పొట్టపై చేయ్ పెట్టి ఒక్క తోపు తోసింది… కెవ్ అని ఏడుస్తూ బయటకి వచ్చిన బిడ్డని  నా కాళ్ల దగ్గర ఉన్న నర్స్ పట్టుకుంది … ఎర్రగా పండులా ఉన్నాడు… నల్లటి జుట్టూ…ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బిడ్డ పుట్టేప్పుడు ఏడవకపోతే మందబుద్ధి అవుతారట..అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయట…అందుకే బిడ్డ పుట్టేప్పుడు ఏడవాలి..దానికోసం తల్లి ఎంతో నరకయాతన అనుభవించి బిడ్డని ఏడిపించే మొదటి ఆఖరిక్షణం అదే…కానీ మనం నాతో సహా అమ్మల్ని ఏడిపిస్తునే ఉంటాం అయినా అన్నీ భరిస్తుంది పురిటినొపఫులే భరించి మనల్ని.కన్న అమ్మ ఇవి భరించడంలో వింత లేదు..అమ్మల్నే కాదు ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నాం….

Mother's Day 2020 Images in Telugu

Mother’s Day 2020 Images in Telugu

ఈ లోకంలోమగాడు ఎన్ని కష్టాలైనా పడొచ్చు కానీ బిడ్డకి జన్మనిచ్చేప్పుడు తల్లి పడే కష్టం ముందు అవన్నీ చాలా చిన్నవీ…. మీ మీ అమ్మలు మీరు కడుపులో పడ్డప్పటి నుండీ భూమి.మీద పడేవరకు ఎంతో కష్టం అనుభవించే ఉంటారు… మానసికంగా ..శారీరకంగా కూడా…“హ్యాపీ మదర్స్ డే” అని అందరికీ విష్ చేయడంతో పాటు… ఒకసారి ఒకే ఒకసారి మీ అమ్మలని దగ్గరకి తీస్కుని ఈ ఒక్కరోజైనా వారిని కష్టపెట్టకుండా ఉండండి.


End of Article

You may also like