Ads
సాధారణం గా సొట్ట బుగ్గలు, పుట్టు మచ్చలు, ఇతర గుర్తులను బట్టి ఫలానా వ్యక్తి చాలా అదృష్టవంతుడు అని చెపుతుంటారు. గొంతు భాగం లో పుట్టుమచ్చలుంటే బంగారం ధరిస్తారని, కనుబొమ్మలు కలిసి ఉన్నవారికి కలిసొస్తుందని, గడ్డం పై పుట్టుమచ్చలు ఉండేవారు అందం గా ఉంటారని, చెవి దగ్గర పుట్టు మచ్చలుంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారని చెబుతుంటారు. అయితే.. సొట్ట బుగ్గలు ఉన్న వారికీ నవ్వినప్పుడు బుగ్గలపై గుంతల్లాగా పడుతుంటాయి. ఇలాంటి గుంతలు శరీరం లో మరో చోట కూడా కొందరికి ఉంటాయట. రోమన్ల ప్రకారం అవి ఉన్న వారు ఎంతగానో అదృష్టవంతులట.
Video Advertisement
నడుము వెనక భాగం లోను, పిరుదుల పై భాగం లోను రెండు గుంతల్లాంటి రంధ్రాలు ఉన్నవారు చాల అదృష్టవంతులట. ఇవి కొందరికి పుట్టుక తోనే వస్తాయట. వీటిని మీకు ఉన్నాయేమో ఎపుడైనా గమనించారా? ఇవి ఉన్న వారు అదృష్టవంతులట. ఈ రంధ్రాలను రోమన్లు వీనస్ అనే వారి దేవతకు చెందిన రంధ్రాలుగా చెబుతుంటారు. ఈ రంధ్రాలను రోమన్లు వీనస్ రంద్రాలు లేదా అపోలో రంధ్రాలు అని పిలుస్తారట. ఈ రంధ్రాలు కలిగి ఉన్న వారు పడక గది లో అంతులేని సుఖాలను అనుభవిస్తారట. ఈ రంధ్రాలు ఉన్న వారికి రక్త ప్రసరణ చాలా ఎక్కువ గా జరుగుతుందట. అందుకే వారు రతి క్రియను ఎక్కువ గా ఆస్వాదించగలుగుతారట. వారికి సులభం గా తృప్తి పొందగల్గుతారట. ఆ సమయం లో వారికి ఎక్కువ శక్తీ ఉంటుందట.
సామాన్యం గా ఈ రంధ్రాలు ఉండే చోట ఎలాంటి కండరాలు ఏర్పడవట. అందువలన వ్యాయాయం చేయడం వలన కానీ, వేరే ప్రయత్నాలవలన గాని ఈ రంధ్రాలను పొందలేము. స్వతహాగా పుట్టుకతోనే ఈ రంధ్రాలు ఏర్పడాలి. అలా ఏర్పడ్డ వారు మాత్రం చాలా అదృష్టవంతులు రోమన్లు నమ్ముతారు. వారికి వీనస్ దేవత పై ఎంత నమ్మకం ఉంటుందో.. ఈ రంధ్రాలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని కూడా వారు అంతే నమ్ముతారు. ఎవరి నమ్మకాలూ వాళ్ళకి ఉంటాయి. కానీ ఇలాంటి నమ్మకాలను వినేటపుడు, తెలుసుకునే టపుడు మనకు కూడా ఆసక్తి గా అనిపిస్తుంది కదా..
End of Article