Ads
కరోనా లాక్ డౌన్ ఎందరో ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. మరెందరికో ఉపాధి లేకుండా చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో ఎంతటి సాఫ్ట్ వెర్ ఉద్యోగం అయినా, ఎన్నాళ్ళు ఉంటుందో..ఇన్నాళ్ళకి ఊడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితి లో తెలివి గా ఉపాధి రంగాన్ని ఎంచుకోవాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుతం దేశం లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి భవిష్యత్ ఉంది. కానీ, ఇవి అంత గా ప్రాచుర్యం తెచ్చుకోకపోవడానికి గల కారణం ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ కొరత ఉండడం. ఈ కొరత దేశవ్యాప్తం గా ఉంది.
Video Advertisement
ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందవచ్చు. నిజానికి ఇది చాలా తేలిక. ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సులభతరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. పైగా, ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ను నిర్వహించడానికి కేంద్ర విద్యుత్ శాఖ కూడా సాయం అందిస్తుంది. దేశం లో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ను పెంచడానికి భారత కేంద్ర మంత్రిత్వ శాఖ అనేక వెసులుబాట్లను కలిపిస్తోంది. వీటిద్వారా తక్కువ ఖర్చుతోనే ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా ఎలక్ట్రిక్ వాహనాలకు బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున నడుపబడతాయి.
అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్ ను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని ప్రారంభించడం కోసం ముందు గా దరఖాస్తు చేసుకోవాలి. ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాల్లో వీటికి ఎక్కువ గా ప్రాముఖ్యత రాబోతోంది. మొత్తం తొమ్మిది ప్రత్యేక నగరాల్లో ఈ ఈవీ పర్యావరణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ సహకరించనుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టిపిసి, పవర్ గ్రిడ్ కార్ప్, ఇండియన్ ఆయిల్ కార్ప్ వంటి సంస్థలు ఈ స్టేషన్లు ఏర్పాటు చేయడం కోసం పైలట్ ప్రాజెక్ట్ లను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులలో భాగం గా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, ప్రతి పాతిక కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి పదకొండు రహదారులను కేంద్రం ఎంచుకుంది. ముందు గా దరఖాస్తు చేసుకుంటే మీరు కూడా అనుమతులు పొందే అవకాశం ఉంటుంది.
End of Article