Ads
సాధారణం గా ఒక మనిషి సగటు ఆయుర్దాయం ఎంత..? మహా అయితే ఎనభై సంవత్సరాలు కదా.. ఇపుడు ఉన్న వారు డెబ్భై ఏళ్ల కె రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. కానీ, భారత్, చైనా లైన్ అఫ్ కంట్రోల్ వద్ద నివసించే హుంజా అనే ఓ తెగ వారు మాత్రం 120 సంవత్సరాల నుంచి 165 సంవత్సరాల వరకు బతుకుతారట.
Video Advertisement
అసలు వీరికి అనారోగ్యం అంటే ఏంటో కూడా తెలీదు. ఇప్పటి వరకు వీరిలో ఎవ్వరికి ట్యూమర్ లాంటి వ్యాధులు రాలేదంటే నమ్మలేం..
కేవలం ఎక్కువ కాలం బతకటం మాత్రమే కాదు. వీరు చాలా యవ్వనంగా కనిపిస్తారట. 65 , 70 సంవత్సరాలు వస్తున్నా కూడా వీరు ఎంతో అందం గా కనిపిస్తారు. మనలో 70 సంవత్సరాలు బతికినా కూడా, చాలా మందికి నలభై సంవత్సరాలు వచ్చేసరికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చేస్తాయి.
మిగతా కాలాన్ని ముక్కుతూ, మూలుగుతూ బతుకు వెళ్ళదీస్తారు. కానీ హుంజా తెగ వారు అలాకాదు. ఎక్కువ కాలం పాటు యవ్వనం గా, ఆరోగ్యం గా బతుకుతారు. అందుకే వీరు అంత ప్రత్యేకం. అంతే కాదు అరవై ఐదేళ్లు వచ్చిన తరువాత కూడా ఆడవాళ్ళూ పిల్లలను కంటుంటారట. ఇంతకీ వీరి ఆరోగ్య రహస్యమేంటో తెలుసా..? వారు తీసుకునే ఆహారమే.
హుంజా తెగవారు ఎక్కువగా హిమాలయ పర్వత శ్రేణుల్లో నివాసం ఉంటుంటారు. పాకిస్థాన్, చైనా, ఆఫ్గనిస్థాన్ దేశాల సరిహద్దులు కలిసే చోట వీరు ఎక్కువ గాఉంటారు.
వారి జీవన విధానాల వలన వారు వందేళ్లకు పైగా జీవించగలుగుతున్నారు. వీరు తేనెను ఎక్కువ గా వారి ఆహరం లో భాగం చేసుకుంటారు. అలాగే, వారు పండించుకునే ఆహారాన్నే తీసుకుంటుంటారట.
మిల్లెట్స్, బార్లీ, ఆప్రికాట్స్, నట్స్, కూరగాయలు అన్ని వారే పండించుకుని తింటారు. ఎక్కువ భాగం కాలినడకనే ప్రయాణం చేస్తుంటారు.
కిలోమీటర్లకు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే, వారు అంత ఆరోగ్యం గా ఉండగలుగుతున్నారు. ఇక్కడివారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు.
End of Article