సానిటరీ పాడ్స్ వ్యర్ధాలను తగ్గించడానికి ఈ విద్యార్థులు చేసిన ప్రయోగం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

సానిటరీ పాడ్స్ వ్యర్ధాలను తగ్గించడానికి ఈ విద్యార్థులు చేసిన ప్రయోగం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

సాధారణం గా మనుషులు వాడే ప్రతి వస్తువు.. కొంతకాలం తరువాత వ్యర్థం గా మారుతుంది. ప్లాస్టిక్, రబ్బర్, కొన్ని రకాల లోహం వంటి వస్తువులు భూమిలో కరగవు. ఫలితం గా ఈ వ్యర్ధాల భూమి పై పేరుకుపోయి కాలుష్యానికి కారణం అవుతుంటాయి. అయితే, వీటిని అరికట్టడం కోసం ప్రత్యామ్నాయం తీసుకురావడం కోసం అనేక ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఉద్దేశం తో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఓ కొత్త ప్రయోగం చేసారు. ఆ వివరాలు, ముచ్చట్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

sanitary pads

ప్రస్తుతం, మహిళలకు ఉన్న ఇబ్బందికి సానిటరీ పాడ్స్ తప్పనిసరి. అయితే.. ఈ పాడ్స్ కూడా యూజ్ అండ్ త్రో పద్దతి లో ఉంటాయి. వీటి వాడకం అయిపోయాక, ఈ వ్యర్ధాలు కూడా భూమి పై పేరుకుపోతున్నాయి. ఈ పాడ్స్ కి ప్రత్యమ్నాయం గా ఆర్గానిక్ పాడ్స్ ని ఈ విద్యార్థులు కనిపెట్టారు. ఇవి భూమిలో కలిసిపోతాయి. ఈ వ్యర్ధాలను తగ్గించడం కోసం తెలంగాణ లోని ములకాలపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ (జెడ్‌పిహెచ్ఎస్) విద్యార్థులు ఈ ప్రయోగం చేసారు. ఈ “జీరో వేస్ట్ సానిటరీ పాడ్స్” కి వారు “స్త్రీ రక్షా పాడ్స్” అని పేరు పెట్టారు. పసుపు, వేప, మెంతి మరియు సబ్జా విత్తనాలను ఉపయోగించి ఈ సానిటరీ ప్యాడ్లను తయారు చేస్తారు.

organic sanitary pads

జెడ్‌పిహెచ్‌ఎస్ ములకలపల్లి విద్యార్థి స్వాతి మాట్లాడుతూ, తమ పరిశోధనలో గతంలో చాలా మంది మహిళలు వీటిని ఉపయోగించారని తెలిపింది. ప్రస్తుతం కనుగొన్న వాటికి సమకాలీనం గా ఉండే మరి కొన్నిటిని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. వేప ఆకులు, మెంతి మరియు పసుపుతో కలిపి, కొంత నీటితో పేస్ట్ లా చేసాక.. అది ఎండిపోయే వరకు ఎండపెడతారు. ఆ తరువాత వీటిని సాధారణ సానిటరీ పాడ్ షేప్ లోనే కట్ చేస్తారు. ఆ పై మెంతులు, సబ్జా విత్తనాలను ఉంచి తేనెటీగ జిగురుతో కలిపి రెండు పత్తి స్ట్రిప్స్ మధ్య ఉంచి సీలు చేస్తారు. ప్రస్తుతం మార్కెట్ లో పెట్రోలియం ఆధారిత సానిటరీ పాడ్స్ లభిస్తున్నాయి. వీరు రూపొందించిన ఆర్గానిక్ పాడ్స్ ఈ కృత్రిమ పాడ్స్ కు గొప్ప ప్రత్యామ్నాయం కాగలవని భావిస్తున్నారు.

stree raksha pads

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న పాడ్స్ కుళ్లిపోవు. ఈ ఆర్గానిక్ పాడ్స్ తో ఈ సమస్య ఎదురుకాకుండా ఉండడం కోసం సేంద్రియ పదార్థాలను ఉపయోగించి ఈ పాడ్స్ ను తయారు చేసారు. పరిశుభ్రత కు సంబంధించిన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం కోసం వీరు తమవంతు ప్రయత్నం చేసారు. తక్కువ ఖర్చు తోనే ఈ పాడ్ లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న పాడ్స్ స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ వీరు తయారు చేసిన స్త్రీ రక్షా పాడ్స్ తో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు.


End of Article

You may also like