Ads
సైన్స్ చెప్పని ఆచారాలు భారత్ లో ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ, వీటి వెనుక మర్మం మాత్రం సైన్స్ కు పూర్తి గా తెలియదు. ఇప్పటికీ కొన్ని కొన్ని బయటపడుతూ ఉన్నా, చాలా వరకు మిస్టరీ లుగానే మిగిలిపోతుంటాయి. అలాంటి మిస్టరీలు ఈ సృష్టిలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి “నాగేనహళ్లి ” గ్రామం.
Video Advertisement
ఈ ఊరిలో పాములు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎవ్వరిని కరవవు. చాలా అరుదు గా తప్ప పాము కరవడం అనేది అక్కడ జరగదు. ఒకవేళ పాము కరిచినా అక్కడివారికి ఏమి కాదు. కానీ, ఆ ఊరి పొలిమేర దాటి బయటకు వస్తే మాత్రం మరణం తప్పదు. దీనివెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పటికి అంతు చిక్కలేదు. ఎంతో పేరు పొందిన సర్ప శాస్త్రజ్ఞులు కూడా దీని వెనుక మర్మమేమిటో పసిగట్టలేకపోతున్నారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలో దావణగిరి జిల్లాలో నాగేన హళ్లి అనే గ్రామం ఉంది. నాగేన హళ్లి అంటే తాచుపాముల గ్రామం అని అర్ధం. ఈ గ్రామం లోనే సర్పాలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. ఒకవేళ ఎవరినైనా పాము కాటేస్తే, వారు ఆ పాముని తీసుకెళ్లి ఊరి చివర ఉన్న యతీశ్వర మండపం వద్ద ఉంచుతారు.
ఆ తరువాత అక్కడినుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామి వారి తీర్ధం తీసుకుని ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ గుడిలోనే జాగారం చేస్తారు. వెంటనే వారి శరీరం నుంచి ఆ విషం నిర్వీర్యమైపోయి వారు ఆరోగ్యం బయటకొస్తారు. ఆ విష ప్రభావం వారిపై పనిచేయదు. ఇది ఆ ఊరిలో ఎప్పటినుంచో ఉంది. కానీ, ఆ విషం వీరిపై ఎలా పని చేయదో.. ఇప్పటివరకు ఏ సైంటిస్ట్ చెప్పలేకపోయాడు.
ఈ స్థలానికి సంబంధించి ఓ కథ ప్రచారం లో ఉంది. ఈ ఊరిలో ఒకప్పుడు యతీశ్వర స్వామి అనే ఓ సాధువు నివాసం ఉండేవారట. ఆయన ఓ సారి కాలినడకన తిరుగుతుండగా.. పొదల్లో ఓ శిశువు ను చూశారట. ఆయన, ఆ శిశువును తీసుకుని అల్లారు ముద్దు గా పెంచుకున్నారట. ఆ బాలుడు ను ఇంటి వద్దే ఉంచి, యతీశ్వర స్వామి భిక్షాటన కు వెళ్లేవారట. ఆ బాలుడు కు 12 సంవత్సరాలు వచ్చిన తరువాత.. ఆ సాధువు ఓ సారి భిక్షాటనకు వెళ్లిన సమయం లో పాము కాటు కారణం గా ఆ బాలుడు మృతి చెందుతాడు.
దీనితో, ఆగ్రహించిన సాధువు నాగరాజు ని శపించాలని భావిస్తాడు. పరిస్థితిని గ్రహించిన నాగరాజు యావత్ సర్ప గణం తో సాధువు ముందుకొచ్చి శరణు కోరతాడు. అంతే కాకుండా, ఆ బాలుడిని కూడా బతికిస్తారు. దీనితో సాధువు శాంతించి ఓ షరతు ని విధిస్తాడు. ఆ గ్రామం లో ఎవరిని సర్పాలు కరవకూడదని, ఒకవేళ ఎవరైనా పాము కాటుకు గురి అయితే.. ఆ గ్రామం లో ఉన్నంత వరకు ప్రాణ హాని ఉండదని తెలిపారు. ఒకవేళ ఊరి పొలిమేర దాటితే మాత్రం మరణం తధ్యమని షరతు పెట్టారు.
ఈవిషయాన్ని ఆయనే స్వయం గా బండరాయి మీద చెక్కి పొలిమేర వద్ద ఉంచారు. అవి నేటికీ కనిపిస్తాయి. అలాగే, ఆయన కొన్ని నియమాలు కూడా పెట్టారు. ఆ గ్రామం లోని ప్రజలు మాంసాహారం భుజించకూడదు.సర్పాలను చంపకూడదు. తెలిసి చేసినా, తెలియక చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అప్పటినుంచి అక్కడ సర్పాలను కూడా పెంపుడు జంతువులు మాదిరి గా పెంచుకుంటున్నారు.
End of Article