Ads
ఫ్రాన్స్ ఐరోపా ఖండం లో మూడవ అతిపెద్ద దేశం. ఫ్రాన్స్ కి ఎక్కువ సంఖ్యలో టూరిస్ట్ లు వస్తుంటారు. ఫ్రాన్స్ జనాభా 6 .8 కోట్లు. విశేషమేమిటంటే.. ఈ దేశ జనాభా కంటే.. ఇక్కడ పర్యటించడానికి వచ్చే టూరిస్ట్ లే ఎక్కువ సంఖ్యలో ఉంటారట. ప్రతి ఏడాది కనీసం ఎనిమిది కోట్ల మంది పర్యటన కు వస్తుంటారట. ఫ్రాన్స్ లో ఈఫిల్ టవర్ చాలా ఫేమస్ అన్న సంగతి మనకి తెలిసిందే.
Video Advertisement
#1. ఇక్కడ డబ్బులను యురోలంటారు. ఇక్కడ లెక్క ప్రకారం ఒక్క యూరో రూ.89 .65 పైసలకు సమానంగా ఉంటుంది. అమెరికన్ డాలర్ కాస్ట్ కంటే.. ఫ్రాన్స్ యూరో కాస్ట్ చాలా ఎక్కువ.
#2. ఐరోపా ఖండం లోనే ఫ్రాన్స్ మూడవ రిచ్ కంట్రీ గా పేరు పొందింది. ఫ్రాన్స్ లో ఎక్కువ మంది క్రిష్టియన్లే ఉన్నారు. ఆ తరువాత స్థానం లో ముస్లిం లు ఉన్నారు. బుద్దిస్ట్ లు చాలా తక్కువ మంది ఉన్నారు.
#3. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్మించబడ్డ ఈఫిల్ టవర్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికి తెలిసిందే. ఈ టవర్ ప్రపంచం లోనే ఎత్తైన టవర్ గా పేరు పొందింది. 1888 సంవత్సరం నాటికి.. ఫ్రెంచ్ విప్లవం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం గా ఈఫిల్ టవర్ ను నిర్మించారు. అప్పటి నుంచి అది ఒక ప్రతిష్టాత్మక నిర్మాణం గా కీర్తి పొందింది.
#4. ఈఫిల్ టవర్ ను కట్టిన మొదట్లో కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంచే విధం గా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, కాలక్రమం లో కమ్యూనికేషన్ కు సంబంధించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుండడం తో ఆ టవర్ ను అలానే ఉంచేశారు. ప్రపంచ యుద్ధం సమయం లో హిట్లర్ ఈ ఈఫిల్ టవర్ ను కూల్చి వేయాలని ప్రయత్నించాడట. కానీ, హిట్లర్ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.
#5. ఫ్రాన్స్ దేశం ఎన్నో కొత్త ఆవిష్కరణలకు నిలయం. మనం చూస్తున్న స్టెతస్కోప్, పారాచూట్ వంటి ఎన్నో పరికరాలను ఫ్రెంచ్ వారే కనిపెట్టారట. కెమెరా ఫోన్లను కూడా 1997 లో ఫ్రాన్స్ దేశస్తులే కనిపెట్టారు.
#6. ఈ దేశం లో ఉండే ప్రతి రెస్టారంట్ సేల్స్ అయిపోయాక ఆహార పదార్ధాలు మిగిలిపోతే వాటిని ప్యాక్ చేసి దగ్గర్లోని అనాధ శరణాలయానికి పంపించాలనే రూల్ ఉంది. అంతే తప్ప వాటిని పారవేయడానికి అక్కడి రూల్స్ ఒప్పుకోవు.
#7. ఇతర దేశాల్లో అమ్మాయిలు వేసుకునే స్కర్ట్స్ లాంటి బాటమ్స్ ను ఫ్రాన్స్ లో పురుషులు కూడా ధరిస్తారు. సూపర్ సినిమా లో కమెడియన్ అలీ డ్రెస్ గుర్తుందా..? అలాంటి డ్రెస్సింగ్ స్టయిల్ ఫ్రాన్స్ దేశీయుల సొంతం. ఈ స్టయిల్ ఫ్రాన్స్ లో 18 వ శతాబ్ద కాలం నుంచే ఉంది.
#8. ఫ్రాన్స్ లోని లవ్రే మ్యూజియం చాలా ఫేమస్. ఈ మ్యూజియం ను చూడడానికి ఇతర దేశాల నుంచి ఏడాదికి కనీసం కోటి మందికి పైగా విజిటర్స్ వస్తుంటారట. ఇలా చెప్పుకుంటే పొతే చాలా విశేషాలే ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఫ్రాన్స్ ప్రత్యేక పర్యాటక ప్రదేశం గా నిలిచింది.
#9. 1600 సంవత్సరం లో ఫ్రాన్స్ లో ఒక వింత చట్టం అమలులో ఉండేదట. పురుషుల్లో కొంతమంది జీన్స్ లో ఉండే మార్పుల కారణం గా గే గా పుడుతుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, వీరు బయటకు ఈ విషయాన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అందరిలాగానే పెళ్లిళ్లు చేసేసుకుని వారు. పెళ్లి అయినా తరువాత వీరిలో అంగస్తంభన జరగకపోతే దానిని నేరం గా భావిస్తారట. పెళ్లి చేసుకున్న అమ్మాయి తనకి నచ్చకపోతే.. కోర్ట్ లో కేసు వేసి విడాకులు తీసుకోవచ్చట.
ఇంకా షాక్ కలిగించే విషయం ఏమిటంటే.. విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటే.. ఆ అబ్బాయి అందరి ముందు పురుషాంగాన్నిఎరెక్ట్ చేసి చూపించాలట. ఇది అందరిముందు చేయలేమనుకుంటే..జడ్జి ముందే భార్యతో శృంగారాన్ని జరిపి తనను తానూ నిరూపించుకోవాల్సి ఉంటుందట. అలా చేయలేని పక్షం లో భార్య తో విడాకులు ఇప్పించేస్తారట.
#10. ఫ్రాన్స్ లో చనిపోయిన వ్యక్తులను కూడా వివాహం చేసుకోవచ్చట. ఇందుకు సంబంధించి అక్కడ ప్రత్యేక చట్టాన్ని రూపొందించారట. ఫ్రాన్స్ లో కొన్ని అనివార్య పరిస్థితుల్లో మరణించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఈ చట్టాల ప్రకారం మరణించిన వ్యక్తి తాలూకు ఆస్తి పెళ్లి చేసుకోవడం వలన లభించదు. అంతే కాదు.. మరణించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే.. ఆ వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
End of Article