Ads
ఎందులో అయినా లేడీస్ ఫస్ట్ అనే స్టేట్ మెంట్ ను బాగానే ఉపయోగిస్తారు. కానీ, రియాలిటీ కి వచ్చేసరికి అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్నంత గా వెసులుబాట్లు ఉండవు. కుటుంబ కట్టుబాట్లే కావచ్చు.. స్వతహాగా అమ్మాయిలు అబ్బాయిలంతా ఫ్రీ గా ఎక్కడపడితే అక్కడ తిరగకుండా ఉండడం కావచ్చు.. కొంత కట్టడి ఉన్న వాతావరణం లోనే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది అమ్మాయిలు.
Video Advertisement
అలాంటి అమ్మాయిలు కూడా ఫ్రీ గా తిరగగలిగే ప్లేస్ ఒకటి ఉంది. అదే సోమ్ డోనా హోటల్. స్పెయిన్ లో బాలెయారిక్ దీవిలో ఈ హోటల్ ఉంది. ఈ హోటల్ కేవలం ఆడవారికి మాత్రమే. పదునాలుగేళ్ళు దాటినా అమ్మాయిలంతా ఇక్కడకు రావచ్చు. అయితే, ఒక్క మగాణ్ణి కూడా ఇక్కడకు రానివ్వరు. కొంతకాలం మగవాళ్లకు దూరం గా ప్రశాంతం గా బతకాలనుకునే ఆడవారు ఎవరైనా ఇక్కడ ఉండి నాలుగు రోజులు గడిపేసి రావచ్చు.
సోమ్ డోనా అంటే మేము మహిళలం అని అర్ధమట. మహిళలకు మాత్రమే ప్రవేశం అని చెప్పేందుకు ఈ హోటల్ కు ఈ పేరు పెట్టారట. ఈ హోటల్ పరిసరాలలోకి మగ వారినెవ్వరిని అనుమతించారట. ఆ హోటల్ కి వచ్చిన లేడీ కస్టమర్ కుటుంబీకులను కూడా అనుమతించరట.
ఇంకో విషయం ఏమిటంటే.. ఈ హోటల్ లో సిబ్బంది ని కూడా ఆడవారినే నియమించాలని యాజమాన్యం భావించిందట.. కానీ, ఉపాధి లో వివక్ష ఉండరాదు అన్న అక్కడి ప్రభుత్వ నియమాల ప్రకారం మొగవారిని కూడా తీసుకోవాల్సి వచ్చిందట. కానీ, ఈ హోటల్ కి వచ్చే ఆడవారి సౌకర్యం కోసం.. మగ ఉద్యోగులకు కఠినమైన నిబంధనలు ఉంటాయట. అమ్మాయిలూ..మీకెప్పుడైనా ప్రశాంతంగా గడిపేయాలనిపిస్తే ఇక్కడికి వెళ్లిపోండి.
https://telugu.samayam.com/viral-adda/life-hacks/this-hotel-has-no-men-allowed-policy-even-for-visitors-also/articleshow/71353700.cms
End of Article